క్రేజీ ప్రొడక్షన్ కంపనీతో సామ్ బిగ్ డీల్

Mon Jan 17 2022 15:12:27 GMT+0530 (India Standard Time)

Samantha Big Deal with Crazy Production Company

సమంత ని వ్యక్తిగత సమస్యలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా ఆమె కెరీర్ మాత్రం రాకెట్ స్పీడుతో దూసుకుపోతూ ఆశ్చర్యపరుస్తోంది. బాలీవుడ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ - 2` సిరీస్ తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సమంత ఆ తరువాత హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నానని ప్రకటించి షాకిచ్చింది. అప్పటి నుంచి మానసికంగా ఎమోషనల్ అయిన సామ్ తన స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు చుట్టొచ్చేసింది.ఆ తరువాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. `పుష్ప`లో స్పెషల్ సాంగ్ చేసి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న సామ్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. `ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ తో సౌత్ లోనూ తన సత్తా చాటుకున్న సామ్ ఇప్పడు అక్కడి మేకర్స్ కి హాట్ ఫేవరేట్ గా మారింది. గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `శాకుంతలం` మూవీని పూర్తి చేసిన తాజాగా `యశోద`లో నటిస్తోంది.

సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సామ్ తాజాగా మరో సారి `ఫ్యామిలీ మెన్ ` డైరెక్టర్స్ తో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్  సమంతకు ఓ క్రేజీ ఆఫర్ ఇవ్వడమే కాకుండా ఆమెతో బిగ్ డీల్ ని కుదుర్చుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ సమంతతో మూడు చిత్రాలకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుందట. బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ కున్న క్రేజ్ అందరికి తెలిసిందే. దాంతో సమంత ఈ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెబుతున్నారు. యశోద తమిళంలో చేస్తున్న `కాతువాకుల రెండు  కాదల్` రాజ్ ఎన్ డీకెల వెబ్ సిరీస్ తరువాత యష్ రాజ్ ఫిల్మ్స్ చిత్రాల్లో సమంత నటించనుందని తెలిసింది. దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని చెబుతున్నారు.

అంతే కాకుండా యష్ రాజ్ ఫిల్మ్స్ లో చేయనున్న మూడు చిత్రాలకు గానూ సమంత భారీ పారితోషికం డిమాండ్ చేసిందని అందుకు వారు కూడా సాను కూలంగానే స్పందించారట. ఇదే నిజమైతే సామ్ కెరీర్ మరో దశ తిరిగినట్టే అంటున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు.