చై (Vs) సామ్: దెబ్బకు దెబ్బ! బస్తీ మే సవాల్ అంటే ఇదే!!

Sun Jan 16 2022 08:00:02 GMT+0530 (India Standard Time)

Samantha And Nagachaitanya

దెబ్బకు దెబ్బ అంటే ఇదే. బస్తీ మే సవాల్ అంటూ ఒకరికొకరు ధీటైన జవాబిచ్చారు. ఇంతకీ ఎవరి మధ్య ఈ సవాల్ అంటే.. ఇంకెవరు ఇటీవలే విడిపోతున్నామని ప్రకటించిన నాగచైతన్య - సమంత నడుమ వార్ ఇది.



ఇంతకుముందు చైతన్య నుంచి విడిపోయిన వెంటనే సమంత రూత్ ప్రభు పుష్ప చిత్రంలో అదిరిపోయే బోల్డ్ ఐటమ్ నంబర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఊ అంటావా ఊహూ అంటావా! అంటూ సాగే పాటలో హాట్ మూవ్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది సామ్. ఈ పాటను పెద్ద సక్సెస్ చేయడంలో తన ప్రతిభను చూపింది. సేమ్ టైమ్ ఇది చైకి కౌంటర్ అంటూ గుసగుస వేడెక్కించింది.

అయితే చైతన్య నుంచి రిప్లై లేదా? అంటే ఇదిగో తనదైన శైలిలో అతడు ఇచ్చిన సక్కర్ పంచ్ మామూలుగా లేదు. ఇప్పటికే సామ్ పై చై అభిమానులు నిందలు మోపారు. నెటిజనులు ట్రోల్స్ చేశారు. బంగార్రాజులో చై ఎక్కువమంది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసి గుచ్చి గుచ్చి సామ్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇటీవల వైరల్ అయిన ఫోటోలలో ఒకదానిలో పుష్పలోని సమంతా పాట నుండి ఒక పోజ్ ని సేకరించి.. దానికి చైతన్య మగువలతో రొమాన్స్ చేస్తున్న వేరొక ఫోటోని యాడప్ చేసి.. ఓ అభిమాని  కౌంటర్ ఇదే అంటూ పంచ్ వేసాడు. సామ్ బోల్డ్ యాక్షన్ చేస్తే.. చై ఇంతమంది అమ్మాయిలతో ఘాటైన రొమాన్స్ చేస్తూ జవాబిచ్చారని అన్నారు. అలాగే ఈ సినిమాలో చైతన్యను పెళ్లిపై ఆసక్తి లేని ప్లేబాయ్ గా చూపించారు. సింగిల్ లైఫ్ చాలా బెటర్ అని చై చెప్పే డైలాగ్స్ సినిమాలో ఉన్నాయి. సామ్ .. చై జీవితంలో ముందుకు సాగుతుండగా.. ఇవన్నీ చూపిస్తూ అంతర్జాలంలో అభిమానులు సమంతను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఇది పంచ్ కు పంచ్ అన్న చందంగా.. తయారైంది.