డిజైనర్ డార్లింగ్ కి సామ్ శుభాకాంక్షలు

Wed Jul 21 2021 16:06:00 GMT+0530 (IST)

Samantha Akkineni Wishes Her Designer

ప్రముఖ డిజైనర్ స్నేహితురాలు శిల్పా రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సమంతా అక్కినేని షేర్ చేసిన ఓ ఫోటో అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళుతోంది. పార్టీలో సరదాగా గడుపుతున్న త్రోబాక్ ఫోటోను సామ్ ఇన్ స్టాలో పోస్ట్ చేయగా క్లిక్ లు లైక్ లతో అంతర్జాలం హీటెక్కింది. ఈ ఫోటోలో ఫ్రెండు సంగతేమో కానీ.. సమంత ఆకర్షణీయమైన రూపం అభిమానులను కట్టి పడేసింది.ఇది మల్టీ కలర్ ఫ్రాక్ స్టైల్.. అలా నడుముకు ముడి వేసి స్లైసీగా  సమంతా తన స్టైలిష్ ఎలివేషన్ ని ఉత్తమంగా ఆవిష్కరించారు. శిల్పా ఆల్-బ్లాక్ డ్రెస్ లో సింపుల్ గా కనిపిస్తున్నారు. సామ్ పరిశ్రమలో ప్రవేశించిన నాటి నుంచి శిల్పాజీ మంచి స్నేహితురాలు. అక్కినేని కుటుంబానికి శిల్పాజీ ఎంతో కావాల్సిన వారు. ఇండస్ట్రీ బిజీయెస్ట్ డిజైనర్ గా రాణిస్తున్నారు.

సమంతా అక్కినేని ఓ వైపు కెరీర్ పరంగా బిజీ బిజీ. తదుపరి చిత్రం శకుంతలం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. రెండవ షెడ్యూల్ ను ఇటీవల హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సమంత తన జీవితంలో ప్రియమైన వారిని విష్ చేసే ఏ సందర్భాన్ని విడిచిపెట్టరు.

``మీరు లేకుండా జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ... బిగ్గరగా నవ్వులు అస్పష్టమైన రాత్రులు .. మీరు నేను. పుట్టినరోజున మీరు అందమైన అమ్మాయి... శిల్పాజీ`` అంటూ సామ్ కవితాత్మకంగా తన ఫ్రెండుతో మెమరీస్ లోకి వెళ్లడం ఆసక్తిని కలిగిస్తోంది. ``డార్లింగ్ డార్లింగ్ సామ్! బ్లెస్ యామ్ టూ.. మీతో ఇంత అద్భుతమైన స్నేహం ఆనందకరం`` అని శిల్పా రెడ్డి రిప్లయ్ ఇచ్చారు. రాశారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత నటనకు గొప్ప ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. ఎల్.టి.టి.ఇ తీవ్రవాదిగా తన నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత సమంత నెట్ ఫ్లిక్స్ తో భారీ కాంట్రాక్ట్ ను కుదుర్చుకోవడం మరో సంచలనం. గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం శాకుంతలం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. నయనతార.. విజయ్ సేతుపతి నాయకానాయికలుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న `కాతువాకుల రేండు కాదల్` షూటింగ్ లోనూ సామ్ జాయిన్ కానుంది.