సేంద్రియ వ్యవసాయం చేస్తున్న అక్కినేని వారి కోడలు...!

Tue Jun 02 2020 22:18:49 GMT+0530 (IST)

Samantha Akkineni Organic Farming

అక్కినేని సమంత.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత దశాబ్దకాలంగా తమిళ తెలుగు సినిమాల్లో నటిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 'ఏ మాయ చేసావే' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సమంత.. విభిన్న పాత్రలతో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. తన మొదటి హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత.. పెళ్ళైన తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఇంకోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ లో కుటుంబంతో విలువైన సమాయాన్ని గడుపుతోంది సామ్. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ లో భర్త నాగ చైతన్యతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.కాగా అక్కినేని వారి కోడలు సమంత ఎంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందో తెలిసిన విషయమే. ఇటీవల కాలంలో వరుస పోస్టులతో అభిమానులతో తన అప్డేట్స్ పంచుకుంటుంది. తన పెట్ తో దిగిన ఫొటోలతో పాటు.. భర్త నాగ చైతన్యతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సమంత తన వెజిటబుల్ గార్డన్ ను అభిమానులకు పరిచయం చేసింది. అర్బన్ కిసాన్ వారితో కలిసి తన ఇంటి టెర్రస్ మీద వెజిటబుల్ గార్డెన్ ను ఏర్పాటు చేసింది. సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న సమంత ఆర్గానిక్ పద్ధతిలో వెజిటబుల్స్ పండించడం నేర్చుకున్నది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా సమంత 'ఓ బేబీ' 'మజిలీ' 'జాను' లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తాజాగా డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టిన సామ్ 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సీజన్ 2లో స్పెషల్ రోల్ లో నటించింది.