సాయి పల్లవిని అభినందిస్తూ చైతూ ని ట్యాగ్ చేయని సామ్..!

Mon Sep 13 2021 20:00:01 GMT+0530 (IST)

Sam Retweets Chaitanya Love Story Trailer

అక్కినేని నాగ చైతన్య - సమంత దంపతుల వ్యక్తిగత జీవితంలో సమస్యలు వచ్చాయని.. వారి దాంపత్య జీవితం సజావుగా సాగడం లేదని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సామ్.. ప్రొఫైల్ నేమ్ లో 'అక్కినేని' తొలగించడం.. తన భర్త చైతూ కు సంబంధించిన ట్వీట్స్ కానీ.. ఫోటోలు కానీ పోస్ట్ చేయక పోవడంతో ఈ పుకార్లకు బలం చేకూరింది. అయితే ఇప్పుడు తాజాగా ''లవ్ స్టోరీ'' ట్రైలర్ పై స్పందించిన సమంత.. ఇందులో హీరోయిన్ ని ట్యాగ్ చేసి హీరో చైతన్య ను ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన ''లవ్ స్టోరీ'' సినిమా ట్రైలర్ ఈరోజు సోమవారం విడుదల అయింది. చైతూ తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని షేర్ చేశారు. అయితే చై ట్వీట్ ని కోట్ చేసిన సామ్.. ''విన్నర్!! టీమ్ మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్'' అంటూ సాయి పల్లవిని ట్యాగ్ చేసి అభినందించింది. ఇందులో తన భర్త చైతన్య గురించి ఏమీ ప్రస్తావించకపోవడం పై నెటిజన్స్ సందేహాలు చేస్తున్నారు. గతంలో చైతూ సినిమాల ట్రైలర్స్ కు సమంత కామెంట్స్ పెడుతూ ఉండేది. కానీ ఇప్పుడు భర్త గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

అయితే ఇక్కడ సమంత కోట్ చూసింది నాగచైతన్య ట్వీట్ అవడం గమనార్హం. దీంతో తన భర్త చైతూ ట్వీట్ ని కోట్ చేసినప్పుడు.. మళ్ళీ స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవకాశం ఏముందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 'విన్నర్' అని చైతన్య ను ఉద్దేశించే సామ్ పేర్కొందని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా 2017 నుంచి వివాహ బంధం కొనసాగిస్తున్న చై - సామ్.. వచ్చే నెల అక్టోబర్ లో రాబోయే తమ పెళ్లి రోజు నాటికి ఈ రూమర్స్ పై క్లారిటీ ఇస్తారని అందరూ భావిస్తున్నారు.