షారుక్ ని పాకిస్తాన్ పంపిస్తామంటోన్న సల్మాన్ ఫ్యాన్స్!

Fri Aug 12 2022 18:35:17 GMT+0530 (IST)

Salman fans who want to send Shahrukh to Pakistan!

బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో మరో స్టార్ హీరో గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వడం అక్కడ సహజమే. ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఇతర హీరోల చిత్రాల్లో ఎలాంటి ఈగో ఫ్యాక్టర్ లేకుండా నటిస్తారు. ఒక వేళ మనసులో  ఉన్నా?  వాటిని వృత్తి పరంగా ఎక్కడా బయటపడనివ్వరు. లోలోపల ఒకరంటే ఒగరు గిట్టకపోయినా అంతా సాప్ట్ గా వెళ్లిపోతుంది.బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న విధానమిది. ముఖ్యంగా ఖాన్ హీరోల్లో ఒకరంటే ఒకరికి గిట్టదు. పోటీ అనేది ఇద్దరి మధ్య వార్ కి తెర తీస్తుంది. కానీ అందులో ఆరోగ్య కరమైన వాతావరణం కనిపిస్తుంది. కానీ అభిమానులు చేసే రచ్చ ద్వారా అప్పుడప్పుడు బయట పడుతుంటాయి. తాజాగా సల్మాన్ ఖాన్ అభిమానులు షారుక్ ఖాని  టార్గెట్ చేసి నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ గొడవ మళ్లీ ఎందుకు తెర మీదకు వచ్చిందంటే?  వివరాల్లోకి వెళ్లాల్సిందే.. అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'లాల్ సింగ్ చడ్డా'లో షారుక్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం చెందింది. దీంతో సల్మాన్  ఖాన్ అభిమానులు షారుక్ గెస్ట్ పాత్ర చేయడం వల్లే సినిమా పోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

"షారుక్ గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చిన  సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. అందుకే 'టైగర్ -3' లో మాకు గెస్ట్ గా షారుక్ వద్దంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొన్ని పోస్టు ల్లో హద్దు మీరిన తనం కనిపిస్తుంది.'పీఆర్ తయారు చేసిన స్టార్.. అభద్రతా భావం న్న వ్యక్తి. ఓ వర్ యాక్టింగ్..అబద్దాలు చెప్పే మనిషి" అంటూ షారుక్ ని విమర్శిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ ని షారుక్ అభిమానులు ట్రోల్ చేస్తే వదిలేదు లేదు. సల్మాన్ అభిమానులుగా షారుక్ ని పాకిస్తాన్ కి పంపిస్తాం అంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు ఉన్నాయి. గతంలో షారుక్ ఖాన్ పాకిస్తాన్ కి మద్దతుగా మాట్లాడిన కొన్ని వ్యాఖ్యల్ని జత చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరి వీటిపై షారుక్ అభిమానులు ఇంకా  రంగంలోకి దిగలేదు.

ఎంటర్ అయితే సీన్ వేరేలా ఉంటుంది. సోషల్ మీడియా వార్ తో వేడెక్కడం ఖాయం. నెట్టింట అభిమానుల మధ్య ఇలాంటి యుద్దాలు  కొత్తేం కాదు. తరుచూ జరిగేవే.  అభిమానుం పేరుతో ఒకర్ని ఒకరు దూషించుకోవడం..అవి వ్యక్తిగతంగా దారి తీయడం..పోలీస్ స్టేషన్లకు వెళ్లడం అంతా మామూలే. బాలీవుడ్ తర్వాత  కోలీవుడ్ లోనూ ఈతరహా వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది.