Begin typing your search above and press return to search.

పిక్ ఆఫ్ ది డే : కళ్లు తిప్పుకోనివ్వని ఫ్రేమ్‌

By:  Tupaki Desk   |   27 Jun 2022 2:30 AM GMT
పిక్ ఆఫ్ ది డే : కళ్లు తిప్పుకోనివ్వని ఫ్రేమ్‌
X
బాలీవుడ్ సూపర్ స్టార్‌ సల్మాన్ ఖాన్‌ ప్రస్తుతం కబీ ఈద్ కబీ దీవాళి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఆ సినిమాలో కీలకమైన గెస్ట్‌ రోల్‌ లో వెంకటేష్ నటిస్తున్నాడు అనే విషయం చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. సల్మాన్ ఖాన్ కబీ ఈద్ కబీ దీవాళి సినిమా షూటింగ్ బ్రేక్‌ సమయంలో రామ్‌ చరణ్ మరియు ఉపాసన సెట్స్ లో సందడి చేశారు.

ముంబై వెళ్లిన సమయంలో సల్మాన్ ఇంటికి చరణ్ తప్పకుండా వెళ్లాడని.. చరణ్‌ అక్కడ ఉన్నన్ని రోజులు కూడా సల్మాన్ ఖాన్‌ అన్ని విషయాలను చూసుకుంటాడనే ప్రచారం ఉంది. అందుకే ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌ కు హైదరాబాద్‌ లో కావాల్సిన అవసరాలకు తన వారిని కేటాయించడంతో పాటు అన్ని విషయాలు కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడట.

తాజాగా సండే స్పెషల్‌ అన్నట్లుగా సల్మాన్‌ ఖాన్‌ తో పాటు వెంకటేష్.. రామ్‌ చరణ్.. పూజా హెగ్డే మరియు ఉపాసనలు కలిశారు. ఈ అయిదుగురి ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒకే ఫ్రేమ్‌ లో ఇంత మంది స్టార్స్ ఉండటంతో పాటు అరుదైన క్లిక్ అవ్వడంతో ఈ ఫోటో పిక్ ఆఫ్ ది డే అన్నట్లుగా నిలిచింది.

ఇక రామ్ చరణ్‌ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆర్ ఆర్ ఆర్‌ మరియు ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాల్లో ఆర్ ఆర్ ఆర్ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చరణ్‌ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా ను చేయబోతున్న విషయం తెల్సిందే .