Begin typing your search above and press return to search.

'విక్రాంత్ రోణ' ను హిందీ ప్రేక్షకులకు అందించనున్న సల్మాన్..!

By:  Tupaki Desk   |   16 May 2022 1:07 PM GMT
విక్రాంత్ రోణ ను హిందీ ప్రేక్షకులకు అందించనున్న సల్మాన్..!
X
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ''విక్రాంత్ రోణ''. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ప్రపంచ వ్యాప్తంగా జూలై 28న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

తెలుగు - కన్నడ - ఇంగ్లీష్ సహా మొత్తం 6 ప్రధాన భాషల్లో 'విక్రాంత్ రోణ' సినిమాని విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మూవీ హిందీ వర్షన్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సమర్పణలో నార్త్ ఆడియన్స్ కు అందించనున్నారు.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర నిర్మాతలు ఓ వీడియోను వదిలారు. సల్మాన్ సమర్పకుడిగా వ్యవహరించడంతో 'విక్రాంత్ రోణ' సినిమాకు క్రేజ్ మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఇతర భాషల సమర్పకులను త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

కిచ్చా సుదీప్ కు సల్మాన్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. 'దబాంగ్ 3' సినిమాలో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే సుదీప్ ఇటీవల హిందీ భాష గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదం చెలరేగిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆయన నటించే సినిమాకు బాలీవుడ్ స్టార్ ప్రెజెంటర్ గా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, 'విక్రాంత్ రోణ' చిత్రంలో నీతా అశోక్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో కనిపించనుంది. నిరూప్ భండారి - రవిశంకర్ గౌడ - మధుసూదన్ రావు - వాసుకి వైభవ్ ఇతర పాత్రలు పోషించారు.

ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా అత్యున్నత సాంకేతిక విలువలతో హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమాని రూపొందించారు. త్రీడీ ఫార్మాట్ లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్ అవుతుండంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే 'విక్రాంత్ రోణ' నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. జీ స్టూడియోస్ & కిచ్చా క్రియేషన్స్ సమర్పణలో షాలిని ఆర్ట్స్ పతాకంపై రూపొందించారు. జాక్ మంజునాథ్ - షాలిని మంజునాథ్ నిర్మించిన ఈ సినిమాకి అలంకార్ పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

బి.అజనీశ్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చగా.. విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రఫీ అందించారు. 'కేజీయఫ్' ఫేమ్ శివకుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ జానీ ఈ సినిమాలో పాటలకు కొరియోగ్రఫీ చేశారు.