భాయ్ తో వెంకీ మల్టీస్టారర్ అంతేగా..!

Sun Dec 04 2022 11:00:01 GMT+0530 (India Standard Time)

Salman Khan And Venkatesh Multi Starrer Movie

కండల హీరో సల్మాన్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. 2023లో అతడు నటించిన భారీ చిత్రాలు  విడుదల కానున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్లు.. టైగర్ 3 .. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రాల కోసం భాయ్ అభిమానులు ఎంతో ఉత్సుకతతో వేచి చూస్తున్నారు.`కిసీ కా భాయ్ కిసీ కా జాన్` 2023 ఈద్ రోజున థియేటర్లలోకి రానుందని ప్రకటిస్తూ ఇటీవల ఒక చిన్న వీడియో ద్వారా వెల్లడించారు. ఈరోజు సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రకటించారు. సల్మాన్ పొడవాటి జుట్టు -ట్రెండీ కాస్ట్యూమ్స్ తో స్టైలిష్ చిత్రాన్ని షేర్ చేసాడు.

ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇందుఓ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించనున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఒలింపిక్స్ విజేత బాక్సర్ విజేందర్ సింగ్ .. జగపతిబాబు కూడా నటించారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.

అలనాటి నాయికతో భాయ్ మళ్లీ..!

దాదాపు 32 ఏళ్ల ప్రేమ తర్వాత నాటి మేటి కథానాయిక రేవతితో సల్మాన్ రీయునైట్ అవుతున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ కలయిక ఆసక్తిని పెంచుతోంది. అయితే యాక్షన్ ఎంటర్ టైనర్ టైగర్ 3లో రేవతి పాత్ర గురించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ వెటరన్ నటి పాత్రలో బిగ్ సర్ ప్రైజ్ ఉంటుందని ట్విస్టును రివీల్ చేస్తుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఒకసారి సల్మాన్ - రేవతి జంట గతంలోకి వెళితే.. లవ్ అనే 1991 క్లాసిక్ మూవీలో నటించారు. `లవ్` (1991) విడుదలై 30 సంవత్సరాలు దాటింది.

అయితే ఇది ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్లాసిక్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని `సాథియా తూనే క్యా కియా` పాటను ఎప్పటికీ మరువలేరు.

లవ్ చిత్రంతోనే రేవతి బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. సల్మాన్ లాంటి స్టార్ సరసన తనకు తొలి అవకాశం. ఈ చిత్రానికి సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. 1991 భారతీయ హిందీ-భాషా శృంగార చిత్రంగా వీకీలోను ఇది రికార్డులకెక్కింది. ఇది తెలుగు సినిమా ప్రేమ (1989)కి రీమేక్. ప్రేమలో వెంకటేష్ సరసన రేవతి నటించింది.

అయితే యాధృచ్ఛికంగా రేవతి తిరిగి వెంకీ- సల్మాన్ లతో కలిసి నటిస్తుండడం ఆసక్తికరం.  `ప్రేమ`(తెలుగు) సినిమా రిలీజ్ హక్కులను షారూఖ్ ఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సొంతం చేసుకుని రీమేక్ చేసింది. అప్పటికి సల్మాన్ ఖాన్ వరుసగా ఆరు హిట్లు కొట్టి కెరీర్ 7వ సినిమాగా వచ్చిన లవ్ తో యావరేజ్ విజయాన్ని అందుకున్నాడు.