Begin typing your search above and press return to search.

ఖిలాడీ హిందీ రీమేక్ లో స‌ల్మాన్ భాయ్

By:  Tupaki Desk   |   11 Jun 2021 3:30 AM GMT
ఖిలాడీ హిందీ రీమేక్ లో స‌ల్మాన్ భాయ్
X
తొలి నుంచి సౌత్ రీమేక్ ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టిన స‌ల్మాన్ భాయ్ తెలుగు సినిమాల రీమేక్ క‌థ‌ల్లో న‌టించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. చంద్ర‌లేఖ‌-సేతు-పోకిరి-కిక్- రెడీ- నీ తోడు కావాలి.. ఇవ‌న్నీ స‌ల్మాన్ రీమేక్ చేసిన‌వే. తాజాగా మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న ఖిలాడీ రీమేక్ లో న‌టించేందుకు భాయ్ ఆస‌క్తిగా ఉన్నార‌ని తెలిసింది.

ఇప్ప‌టికే ఖిలాడీ రీమేక్ హ‌క్కుల్ని భాయ్ చేజిక్కించుకున్నారు. హిందీ వెర్ష‌న్ కి ర‌మేష్ వ‌ర్మ‌నే డైరెక్ట్ చేయాల‌ని ఆఫ‌ర్ చేశార‌ట‌. ఖిలాడీ టీజ‌ర్ న‌చ్చింది. వెంట‌నే మేక‌ర్స్ ని సంప్ర‌దించాక‌.. క‌థ కూడా బావుంద‌ని హ‌క్కులు కొనుగోలు చేశార‌ట‌. కిక్.. ఖిలాడీ ఇవి రెండూ ర‌వితేజ న‌టించిన‌వి.. కిక్ తో భాయ్ పెద్ద హిట్టు కొట్టాడు. ఇప్పుడు ఖిలాడీ అలానే వ‌ర్క‌వుటవుతుంద‌నే భావిద్దాం.

ఖిలాడి ప్రస్తుతం షూట్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. డింపుల్ హయాతి- మీనాక్షి చౌదరి ఇందులో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. హిందీ వెర్ష‌న్ కి ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా లేక ఇంకెవ‌రైనా జాయిన‌వుతారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.