Begin typing your search above and press return to search.

'సలార్' షూటింగ్ అప్డేట్.. 'కేజీయఫ్' తరహా ఇంటర్వెల్ బ్లాక్..?

By:  Tupaki Desk   |   12 Sep 2021 12:30 AM GMT
సలార్ షూటింగ్ అప్డేట్.. కేజీయఫ్ తరహా ఇంటర్వెల్ బ్లాక్..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ''సలార్'' ఒకటి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత ఇటీవలే ఓ షెడ్యూల్ షూటింగ్ జరిపారు. ఈ క్రమంలో 'ఆది పురుష్' షూటింగ్ కోసం ముంబై వెళ్ళిన ప్రభాస్.. ఆ షెడ్యూల్ పూర్తి చేసి శనివారం హైదరాబాద్ లో 'సలార్' టీమ్ తో జాయిన్ అయ్యారు.

ఒక వారం పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈ షెడ్యూల్ లో ఇంటర్వెల్ బ్లాక్ తో సహా హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. 'కేజీయఫ్' తరహాలోనే 'సలార్' చిత్రంలో కూడా ఇంటర్వెల్ బ్లాక్ ను ప్రశాంత్ నీల్ భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న నాలుగు విభిన్నమైన ప్రాజెక్ట్స్ లో 'సలార్' సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. అందులో డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'సలార్' ఫస్ట్ లుక్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. 'ది మోస్ట్ వైలెంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వైలెంట్' అంటూ ప్రభాస్ ను సరికొత్త అవతారంలో చూపించి ప్రశాంత్ నీల్ అందరిని సర్ప్రైజ్ చేసాడు. ఇందులో ప్రభాస్ ఓ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారని హింట్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత కంప్లీట్ మాస్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. ఎలాంటి సంచనాలు సృష్టిస్తాడో చూడాలి.

'సలార్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'కేజీయఫ్' చిత్రానికి వర్క్ చేసిన టెక్నికల్ టీమ్ అంతా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇది వరకు ప్రకటించారు. అయితే అదే బ్యానర్ లో తెరకెక్కిన 'కేజీయఫ్ 2' సినిమాని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు మ్ దీనిని బట్టి చూస్తే 'సలార్' విడుదల వాయిదా పడుతుందని అర్థం అవుతోంది.