Begin typing your search above and press return to search.

సలార్ థియేట్రికల్ డీల్స్.. నిర్మాతలకు జాక్ పాట్!

By:  Tupaki Desk   |   1 April 2023 10:00 PM GMT
సలార్ థియేట్రికల్ డీల్స్.. నిర్మాతలకు జాక్ పాట్!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉన్న ఈ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ కథాంశంతో ఉండబోతుంది. ఇక ఈ సినిమాని హాలీవుడ్ లో సైతం రిలీజ్ చేయడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ ఇప్పటికే స్టార్ట్ అయ్యిందట. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ఇప్పటి వరకు 300 కోట్ల వ్యాపారం జరిగినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ రైట్స్ ని 150 కోట్లకి గీతా ఆర్ట్స్, ఎస్ వి సి ప్రొడక్షన్ లలో ఒకరు సొంతం చేసుకోబోతున్నట్లుగా సమాచారం.

అలాగే ఓవర్సీస్ రైట్స్ పహర్స్ డిస్ట్రిబ్యూటర్ 65 కోట్లకి సొంతం చేసుకుంటారని తెలుస్తోంది. తమిళ్ రైట్స్ ని 23 నుంచి 25 కోట్లకు రెడ్ జెయింట్ లేదా న్యూ డీలర్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక కర్ణాటకలో హొంబలే ఫిలిమ్స్ రిలీజ్ చేయబోతుంది. 50 కోట్ల టార్గెట్ తో కన్నడలో ఈ మూవీ రిలీజ్ అవుతుందని సమాచారం.

ఇంకా హిందీతో పాటు కొన్ని డీల్స్ పూర్తి కావాల్సి ఉందని తెలుస్తోంది. సుమారు 400 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ డేట్ పై ఇదివరకే క్లారిటీ ఇచ్చారు.

కేజీఎఫ్ సిరీస్ తో స్టార్ దర్శకుడుగా మారిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతూ ఉన్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

దానికి తగ్గట్లుగానే సినిమా బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఈ సినిమా ద్వారా వెయ్యి కోట్ల  కలెక్షన్స్ అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగానే సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఇక ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేసి వరల్డ్ వైడ్ గా సలార్ మూవీతో మరోసారి ప్రశాంత్ నీల్ స్టామినా పరిచయం చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.