Begin typing your search above and press return to search.

సలార్.. గీతా ఆర్ట్స్ చేయి పడితే

By:  Tupaki Desk   |   10 Jun 2023 11:01 AM GMT
సలార్.. గీతా ఆర్ట్స్ చేయి పడితే
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్ దశకి వచ్చేసింది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సలార్ రెండు భాగాలుగానే తెరకెక్కుతోంది. ఇందులో పార్ట్ 1 సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ డీల్స్ ఇప్పటికే మొదలయ్యాయనే ప్రచారం నడుస్తోంది. చాలా మంది ప్రొడ్యూసర్స్ ఆయా భాషలకి సంబందించిన సలార్ థీయాట్రికల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. 600 కోట్ల వరకు సలార్ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆదిపురుష్ హిట్ అయితే అది సలార్ మూవీకి కూడా బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక ఈ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ కోసం గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయంట. త్వరలో ఈ డీల్ పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఒక వేళ గీతా ఆర్ట్స్ సలార్ మూవీ తెలుగు రైట్స్ ని సొంతం చేసుకుంటే మాత్రం మరింత హైప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అల్లు అరవింద్ సినిమాని మార్కెట్ చేయడంలో దిట్ట.

అలాగే థియేటర్స్ కూడా అరవింద్ చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కచ్చితంగా మూవీకి గీతా ఆర్ట్స్ అనేది అదనపు బలం అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే గీతా ఆర్ట్స్ తో పాటుగా మరికొంత మంది కూడా సలార్ హక్కుల కోసం పోటీలో ఉన్నారు.

అయితే వీరిలో ఎవరి నుంచి బెస్ట్ డీల్ వస్తుందో వారికే రైట్స్ ని ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక సలార్ ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లు అందుకోవడం అనేది చాలా ఈజీగా జరిగిపోతుందని భావిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ రికార్డులని సలార్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితుల మాట. కేజీఎఫ్ సిరీస్ తో ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఇమేజ్ ఇండియన్ వైడ్ గా భాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. వీరిద్దరి కాంబోలో అంటే కచ్చితంగా అది నెక్స్ట్ లెవల్ లో అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఆ కాంబినేషన్ సలార్ చిత్రానికి హైయెస్ట్ బిజినెస్ జరగడానికి కారణం అవుతోంది.