Begin typing your search above and press return to search.
సలార్.. ఖరీదైన యాక్షన్ ఎపిసోడ్!
By: Tupaki Desk | 22 March 2023 5:00 PMయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా సలార్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. కేజీఎఫ్ సిరీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ మూవీ ద్వారా మరోసారి అందరు దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ కెరీర్‌లో మరో 1000 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకునే చిత్రంగా సలార్ ఉండబోతోంది అని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇటలీ దేశంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.
గ్యాంగ్‌స్టార్ కథ నేపథ్యంలో సినిమా ఉండడంతో ఆ దిశగానే ఇటలీలో అత్యంత ప్రాచీనమైన ఓ భవంతిలో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతుంది.
ఈ షెడ్యూల్ సీక్వెన్స్ కోసం ఏకంగా 7 కోట్ల రూపాయలతో భారీ సెట్‌ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెట్ నిర్మాణం జరుగుతోందని సమాచారం. ఇక ఆర్ ఎఫ్ సీలో నిర్మాణం జరుగుతున్న ఈ సెట్‌లోనే ప్రభాస్ ఎలివేషన్ షాట్స్, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కెరియర్ లో బాహుబలి తర్వాత మరో భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుండడం విశేషం.
ఇప్పటికీ ఈ మూవీలో పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని పలు షెడ్యూల్స్‌లో పూర్తిచేస్తూ వస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరగబోయే షెడ్యూల్‌తో మెజారిటీ సూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని తెలుస్తుంది. సెప్టెంబర్ 28 న ఈ మూవీ ని రిలీజ్ చేయడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నారు.
అలాగే ఇండియా నుంచి మొట్టమొదటి హాలీవుడ్ చిత్రంగా సలార్ ని రిప్రజెంట్ చేయాలని భావిస్తున్నారు. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ క్వాలిటీ కోసం భారీగానే ఖర్చు చేయడానికి నిర్మాత విజయ్ కిరంగదూర్ సిద్ధమవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.