శాకుంతలం.. ఈ లుక్ లో సమంత మైండ్ బ్లోయింగ్!

Mon Jan 30 2023 12:00:02 GMT+0530 (India Standard Time)

Sakunthalam.. Samantha is mind blowing in this look!

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో నటించిన శాకుంతలం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా రూపొందింది. ఇందులో శకుంతల పాత్రలో సమంత ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ సినిమాలో సామ్ ను శకుంతలగా చూపించేందుకు గుణ శేఖర్ ఎంతగానో కష్టపడ్డారు. ప్రతీ ఫ్రేమ్ లోనూ గొప్పగా చూపించేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు. పౌరాణిక ప్రేమగాథలో ఒరిజినాలిటీ ఉండేందుకు ఒరిజినల్ నగలనే వాడారట చిత్రబృందం. మొత్తం 3 కోట్ల రూపాయల విలువ చేసే నగలను సామ్ మెడలో వేసి శకుంతలలా చూపించారు. వసుంధర డైమండ్ రూఫ్ వాళ్లకు సంబంధించిన నగలను ఈ సినిమాలో చూపించారు.

ఈ నగల వల్ల సామ్ మరింత అందంగా కనిపించింది. ముఖ్యంగా సామ్ కట్టుబొట్టు అందరినీ ఆకట్టుకునేందుకు ఆమె నగలు చీరనే ప్రత్యేకం. సామ్ కు స్టైలిస్ట్ గా నీతా లల్లూ వ్యవహరించారు. అలాగే ఈ సినిమా కోసం ఉపయోగించిన నగలను నేహా అనుమోలు డిజైన్ చేశారు. యువరాణిగా సామ్ మెరిసిపోయేలా కనిపించేందుకు నిజమైన నగలను వాడి.. అందరిలో చెరగని ముద్ర వేశారు. అంతే కాదండోయ్ సామ్ కట్టుకున్న చీరలో కూడా ఒరిజినల్ ముత్యాలను పొదిగారట.

ఆ చీర మొత్తం బరువు 30 కిలోల వరకు ఉంటుందని సమాచారం. ఇంత బరువు ఉన్న చీరతో సామ్ ఏడు రోజుల పాటుషూటింగ్ లో పాల్గొందట. కవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలం సినిమాను తెరకెక్కించారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రీడీ టెక్నాలజీతో విజువల్ వండర్ గా గుణ శేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా అంటే తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ బాషల్లో వచ్చే నెల 17వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.