శాకుంతలం మల్లిక సాంగ్.. మధురమైన ప్రేమలో సమంత!

Fri Mar 31 2023 14:19:35 GMT+0530 (India Standard Time)

Sakunthalam Mallika Song

సమంత హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం సమంత మయోసైటీస్ బారిన పడిన తరువాత ఈ మధ్యనే కోరుకుంటున్నాను. ఆమె హీరోయిన్ గా నటించిన యశోద సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానని నమ్మకంతో ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఆయన కుమార్తె నీలిమ గుణశేఖర్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాని దిల్ రాజు పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాకి ఫైనాన్సు కూడా చూసుకున్న దిల్ రాజు సినిమాని తెలుగు రాష్ట్రాల్లో సమర్పిస్తూ తానే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 14వ తేదీన 3d ఫార్మాట్లో కూడా విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఈ మధ్యనే సినిమా యూనిట్ ప్రారంభించింది.

 ఇక తాజాగా ఈ సినిమా నుంచి మల్లికా మల్లికా అంటూ సాగుతున్న ఒక సాంగ్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. నిమిషం 12 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సాంగ్ లో శకుంతలగా సమంత దుష్యంతుని గుర్తు తెచ్చుకుంటూ ఆయన కోసం పాడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో సమంత శాకుంతల పాత్రలో నటిస్తుండగా దుష్యంతుని పాత్రలో మలయాళ నటుడు దేవ మోహన్ నటిస్తున్నారు.

అల్లు అర్జున్ కుమార్తె అర్హ భారతుడి పాత్రలో నటిస్తుండగా ఇతర కీలక పాత్రలలో ప్రకాష్ రాజ్ మోహన్ బాబు అనన్య నాగళ్ళ మధుబాల వంటి వారు నటిస్తున్నారు. మయోసైటిస్ బారినపడిన తర్వాత ఈ మధ్యనే సమంత కోలుకున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా సమంత పెద్ద ఎత్తున పాల్గొంటుంది సినిమా ఫైనల్ కాపీ చూసిన తర్వాత సినిమా సక్సెస్ విషయంలో సమంత చాలా కాన్ఫిడెంట్ గా ఉందని అంటున్నారు ఈయన పెన్షన్ లో సినిమా మీద ప్రేక్షకులలో కూడా అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఇక మల్లికా మల్లికా అంటూ సాగుతున్న ఈ సాంగ్ లో విజువల్స్ కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి.