Begin typing your search above and press return to search.

లెజెండ‌రీ ద‌ర్శ‌కుడి కూతురు చిట్టి పొట్టి ప‌రికిణీ

By:  Tupaki Desk   |   28 May 2023 7:19 AM GMT
లెజెండ‌రీ ద‌ర్శ‌కుడి కూతురు చిట్టి పొట్టి ప‌రికిణీ
X
బుల్లితెర ఫిలింమేక‌ర్ రామానంద్ సాగ‌ర్ పాపులారిటీ గురించి తెలిసిందే. రామానంద్ సాగర్ (చంద్రమౌళి చోప్రా) పాపుల‌ర్ దర్శకనిర్మాత‌. దూరదర్శన్ లో ప్రసారమై జనాదరణ పొందిన ధారావాహిక (సీరియ‌ల్) `రామాయణ్`ను అతడు నిర్మించాడు. 78 భాగాల ఈ సీరియ‌ల్ భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా తెర‌కెక్కింది. ఈ సీరియల్ లో శ్రీ‌రామునిగా అరుణ్ గోవిల్ సీతగా దీపికా చికాలియా నటించారు. భారత ప్రభుత్వం అతడిని 2000వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

అయితే రామానంద్ మ‌న‌వ‌రాలు సాక్షి చోప్రా సంగీత‌(పాప్) ప్ర‌పంచంలో స్టార్ కావాల‌ని క‌ల‌లు కంటోంది. ఇప్ప‌టికే సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టిక్ టాక్ - ఇన్ స్టాలో ల‌క్ష‌ల్లో అభిమానులను కలిగి ఉన్న ఈ బ్యూటీ బోల్డ్ యాటిట్యూడ్ నిరంత‌రం హాట్ టాపిక్. సాక్షి వ‌రుసగా గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తోంది. చిట్టి పొట్టి ప‌రికిణీలు బికినీ దుస్తుల్లో సాక్షి ఏమాత్రం మొహ‌మాటానికి పోదు. ఇంత‌కుముందు బిగ్ బాస్ 14లో ఇంటి స‌భ్యురాలిగా అల‌రించిన ఈ బ్యూటీ లాస్ ఏంజెల్స్ LA- ఆధారిత గాయనిగా గేయరచయితగాను సుప‌రిచితురాలు. నిరంత‌రం రెచ్చగొట్టే ఫోటోషూట్ల‌తో తరచుగా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.

అమెరికాలో ఉంటున్న సాక్షి చోప్రా సంగీత విద్వాంసురాలు కావాలనుకుంటోంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 546K కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా... ఫోటో అండ్ రీల్-షేరింగ్ యాప్ ల‌లో త‌న‌ బికినీ ఫోటోలు వీడియోలు టాప్ లెస్ ఫోటోలతో ఆక‌ట్టుకుంటోంది. సాక్షి ప‌లు కార్పొరెట్ ప్ర‌క‌ట‌న‌ల్లోను న‌టించింది. సాక్షి చోప్రా యూట్యూబ్ లో కూడా చాలా పాపుల‌రైంది. లేడీ గాగా `మిలియన్ రీజన్స్` మొదటి వెర్షన్.... ఖలీద్ `లొకేషన్` ట్యూబ్ లో దుమారం రూపాయి. తన బోల్డ్ ఫోటోషూట్ల‌పై విరుచుకుప‌డే విమర్శలకు సాక్షి చోప్రా త‌న‌ను విమ‌ర్శించేవాళ్ల‌ను నాన్ సెన్స్ అంటూ తీసిపారేస్తుంది.

1932లో రామానంద్ సాగర్ రైడర్స్ ఆఫ్ ద రైల్ రోడ్ అనే మూకీ చిత్రానికి క్లాపర్ బాయ్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. దేశవిభజన అనంతరం 1949లో ఇతడు ముంబైకి తన మకాం మార్చాడు. 1940లలో పృథ్వీరాజ్ కపూర్ ఆధీనంలోని పృథ్వీ థియేటర్స్ లో ఇతడు అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేశాడు. కపూర్ పర్యవేక్షణలో కొన్ని నాటకాలకు దర్శకత్వం వహించాడు. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు ఇతడు రాజ్ కపూర్ సూపర్ హిట్ సినిమా బర్సాత్ కి కథ- స్క్రీన్‌ప్లే అందించాడు. ఇతడు సాగర్ ఫిల్మ్స్‌ (ప్రైవేట్ లిమిటెడ్) అనే సినిమా- టెలివిజన్ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.

1985లో ఇతడు టెలివిజన్ రంగంలోకి ప్రవేశించాడు. మోతీ సాగర్ దర్శకత్వంలో దాదా దాదీకి కాహానియా సీరియల్ ను నిర్మించాడు. అది మొదలు ఇతని సంస్థ సాగర్ ఆర్ట్స్ భారతీయ చరిత్రకు సంబంధించిన టెలివిజన్ సీరియళ్లను నిర్మించడం ప్రారంభించింది. ఇతడు దర్శకత్వం వహించిన రామాయణ్ దూరదర్శన్‌లో 1987 జనవరి 25న మొదటి ఎపిసోడ్ ప్రసారమయ్యింది. దీని తరువాత కృష్ణ- లవ్ కుశ్ టెలీసీరియళ్ళను నిర్మించి దర్శకత్వం వహించాడు. 1988లో ఇతడు విక్రమ్‌ ఔర్ భేతాళ్ అనే సీరియల్ కు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత అలీఫ్ లైలా- సాయిబాబా టెలీసీరియళ్లను తీశాడు. రామాయణ్ ధారావాహికను మొదట 52 వారాలలో ప్రసారం చేయడానికి నిర్మించాడు. అయితే ఆ ధారావాహికకు వచ్చిన ప్రజాదరణ దృష్ట్యా మూడుసార్లు పొడిగించి చివరకు 78 వారాలు ప్రసారం చేశారు.