శాకిని - డాకిని వచ్చేస్తున్నారు!

Tue Aug 16 2022 21:00:01 GMT+0530 (IST)

Sakini - Dakini is coming!

దక్షిణ కొరియన్ మూవీస్ కు తెలుగులో మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల సమంత టైటిల్ పాత్రలో నటించిన 'ఓ బేబీ' సౌత్ కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. నందిని రెడ్డి డైరెక్ట్ చేసి ఈ మూవీ మంచి విజయాన్ని సాధించిన నటిగా సమంతకు మంచి పేరు తెచ్చి పెట్టింది. బాక్సాఫీస్ వద్ద మేకర్స్ కి కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ తో తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ గురు ఫిలింస్ క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా మరో కొరియన్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.జాసన్ కిమ్ డైరెక్ట్ చేసిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ 'మిడ్ నైట్ రన్నర్స్' మూవీని తెలుగులో 'శాకిని - డాకిని'గా రీమేక్ చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలోని కీలక పాత్రల్లో రెజీనా కసాండ్రా నివేదా థామస్ నటించారు.

కొరియన్ మూవీలో ఇద్దరు హీరోలు కీలక పాత్రల్లో నటిస్తే ఈ రీమేక్ లో ఆ పాత్రలని ఫిమేల్ పాత్రలుగా మార్చి చేశారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో వున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ మంగళవారం ప్రకటించారు.

యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీని సెప్టెంబర్ 16న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేశారు. పింక్ కలర్ బ్యాగ్రౌండ్ గ్రే షేడ్స్ తో వున్న రెజీనా కసాండ్రా నివేదా థామస్ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా టైటిల్ మధ్య అక్షరాలని పింక్ కలర్ లో చూపిస్తూ వుండటం మరింతగా ఎట్రాక్ట్ చేస్తోంది.  

ఇక పోస్టర్ లో కనిపిస్తున్న ఇద్దరి డ్రెస్సింగ్ స్టైల్ కూడా దాదాపుగా ఒకేలా వుండటం విశేషం. దక్షిణ కొరియాలో సూపర్ హిట్ గా నిలిచిన 'మిడ్ నైట్ రన్నర్స్' యూనివర్సల అప్పీల్ వున్న కథ కావడంతో దీన్ని తెలుగు ప్రేక్షకుల ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకంతో ఈ మూవీని రీమేక్ చేశామని మేకర్స్ కాన్ఫిడెన్స్ తో వున్నారు.

ఈ మూవీకి ఛాయాగ్రహణం రిచర్డ్ ప్రసాద్ సంగీతం మైకీ మెక్ క్లియరీ నరేష్ కుమారన్ ఎడిటింగ్ విప్లవ్ నిషాదమ్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ : అక్షయ్ పూళ్ల ఆర్ట్ :  గాంధీ నడికుడిగర్.