వెంకీ మామ ఈసారి గట్టిగా ఉంటుందంతే..!

Fri Mar 31 2023 23:00:01 GMT+0530 (India Standard Time)

Saindhav Venkatesh's film are very special

విక్టరీ వెంకటేష్ ఊర మాస్ సినిమా తీస్తే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుందని తెలిసిందే. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో కెరీర్ లో చాలా వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే వెంకీ సీరియస్ సినిమాలు చేస్తే మాత్రం ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.ఓ పక్క ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తూ మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చారు వెంకటేష్. ప్రస్తుతం ఆయన చేస్తున్న మరో యాక్షన్ మూవీ సైంధవ్. హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

హిట్ 1 హిట్ 2 సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శైలేష్ వెంకటేష్ తో సైంధవ్ అంటూ ఒక కంప్లీట్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైనర్ ని తీసుకొస్తున్నారు. ఈ సినిమా కథ మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది.

సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే వారెవా అనిపించాడు డైరెక్టర్ శైలేష్ కొలను. సినిమా కూడా అవుట్ పుట్ బాగా వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. సినిమాను డిసెంబర్ 23న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఈసారి ఇయర్ ఎండింగ్ కి మాస్ ట్రీట్ ఇచ్చేందుకు వెంకటేష్ సిద్ధమవుతున్నారు. నారప్ప తర్వాత వెంకటేష్ మళ్లీ తన మార్క్ ఎంటర్టైనర్స్ చేస్తూ వచ్చారు. అయితే సైంధవ్ వెంకటేష్ సినిమాల్లో చాలా ప్రత్యేకం అంటున్నారు. తన లుక్స్ యాక్షన్ అంతా కూడా కంప్లీట్ మాసీగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని టాక్.

వెపన్ తో వెంకటేష్ సైంధవ్ ప్రచార చిత్రాలు సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. వెంకటేష్ ల్యాండ్ మార్క్ మూవీ 75వ సినిమాగా వస్తున్న ఈ సైంధవ్ తో ఈసారి ఫ్యాన్స్ కి జబర్దస్త్ ట్రీట్ అందించాలని ఫిక్స్ అయ్యారట. మరి వెంకటేష్ సైంధవ్ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.