సైంధవ్.. ర్యాంపేజ్ రోలింగ్

Wed Mar 22 2023 12:37:05 GMT+0530 (India Standard Time)

Saindhav Rampage Rolling

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే సినిమా స్టార్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.  వెంకటేష్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీగా ఈ సినిమా ఉండబోతుంది. ఇప్పటికే హిట్ సిరీస్తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ప్రత్యేకమైన గుర్తింపుని శైలేశ్ కొలను సొంతం చేసుకున్నాడు.  ఊహించని విధంగా వెంకటేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ సొంతమైంది.నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాని  నిర్మిస్తున్నారు.  ఇదిలా ఉంటే పాన్ ఇండియా రేంజ్లోనే ఈ మూవీ కూడా తెరకెక్కుతుండటం విశేషం.  

యాక్షన్ థ్రిల్లర్ కావడంతో పాటు యూనివర్సల్ అప్పీల్ ఉన్న కంటెంట్ ఉండడం వల్ల ఈ మూవీని పాన్ ఇండియా రిలీజ్ అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ మార్కెట్ పరిధికి మించి ఈ మూవీ కోసం ఖర్చు చేస్తుండడం విశేషం.  ఇక విక్టరీ వెంకటేష్ హిందీలో కూడా ఉంది.

 ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమాలో కీలకపాత్రలో కూడా నటిస్తున్నాడు.  దీంతో సైంధవ్ సినిమాకి కూడా మంచి మార్కెట్ దొరుకుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గత నెలలోనే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ గురువారం నుంచి ప్రారంభించబోతున్నట్లుగా అఫీషియల్ పోస్టర్తో కన్ఫర్మ్ చేశారు.  

ఉగాది విషెస్ చెబుతూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో వెంకటేష్ రఫ్గా గడ్డంతో కనిపిస్తూ ఉండటం విశేషం.  ఇక మాస్ అప్పీల్ కూడా గట్టిగానే ఉంది.

 పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఒక బుల్లెట్ బైక్ తో పాటు హెవీ వెహికల్ కనిపిస్తోంది. డార్క్ సైడ్ బ్యాక్ డ్రాప్ లో వెంకటేష్ లుక్ ని హైలైట్ చేస్తూ పోస్టర్ వదిలారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నారప్ప దృశ్యం సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ నుంచి  వస్తున్న మూవీ కావడంతో హాట్రిక్ పై కన్నేసారు.  ఘర్షణ తర్వాత ఆ స్థాయిలో సీరియస్ క్యారెక్టర్లో వెంకటేష్ ఈ మూవీలో కనిపించబోతుండటం విశేషం.        


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.