సైంధవ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Wed Mar 29 2023 21:20:20 GMT+0530 (India Standard Time)

Saindhav Movie Release Date Fixed

గత కొన్నేళ్ళుగా వెంకటేష్ ఎక్కువగా రీమేక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకి వస్తు ఉన్నారు. ఆయన చేసిన గురు  నారప్ప దృశ్యం సినిమాలు మూడు కూడా రీమేక్ కథలతోనే తెరకెక్కాయి. ఈ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని వెంకటేష్ తన ఖాతాలో వేసుకున్నారు. వాటికి ముందు మారుతితో బాబు బంగారం అనే సినిమా చివరిగా వెంకటేష్ స్ట్రైట్ కథతో చెప్పారు.ఆ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే చాలా కాలం తర్వాత మరల ఇప్పుడు ఫుల్ రఫ్ లుక్ లో పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ ని సైంధవ్ సినిమాలో వెంకటేష్ పోషిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది కావడం విశేషం. ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.

ఘర్షణ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలో వెంకటేష్ పవర్ ఫుల్ సీరియస్ రోల్ లో  వెంకటేష్ పవర్ కనిపించాడు. అయితే ఈ సినిమా కూడా తమిళ్ హిట్ మూవీ రీమేక్ అని చెప్పాలి.

అయితే ఇప్పుడు హిట్ సిరీస్ తో సూపర్ సక్సెస్ కొట్టిన శైలేష్ కొలను లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో వెంకటేష్ సైంధవ్ సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాని వెంకట్ బోయపనల్లి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక పాన్ ఇండియా లెవల్ లోనే ఈ మూవీని తెరకెక్కిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ సినిమాతో వెంకటేష్ హ్యాట్రిక్ కొట్టడంతో పాటు పాన్ ఇండియా లెవల్ లో తన ఇమేజ్ ని పెంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ మూవీ రిలీజ డేట్ ని చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసింది. డిసెంబర్ 22న ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు అనే మాట వినిపిస్తుంది. ఇక కోలీవుడ్ సెన్సేషన్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.