Begin typing your search above and press return to search.

పుష్ప-2పై సాయి పల్లవి కామెంట్.. హ్యాపీ అంటూ..

By:  Tupaki Desk   |   30 March 2023 12:49 PM GMT
పుష్ప-2పై సాయి పల్లవి కామెంట్.. హ్యాపీ అంటూ..
X
పుష్ప.. పుష్ప రాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును బద్ధలు చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కింకించిన ఈ సినిమా.. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. తగ్గేదే లే డైలాగ్ తో పాటు రారా సామి పాట విపరీతమైన క్రేజ్ ను అందుకుంది. దీనికి సీక్వెల్ అయిన్ పుష్ప-2 షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే.

పుష్ప పార్ట్ 1 అనుకోని రీతిలో సంచలన విజయాన్ని అందుకోవడంతో పుష్ప సెకండ్ పార్ట్ ను భారీగా తెరకెక్కించాలని మూవీ మేకర్స్ ఫిక్సయ్యారు. తెలుగుతో పాటు ఇతర భాషా సినీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం వివిధ భాషల నటీనటులను పుష్ప-2 లో భాగం చేయనున్నారన్న వార్తలు వచ్చాయి. పుష్ప సెకండ్ పార్టులో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి కూడా నటిస్తోందని వార్తలు వచ్చాయి.

పుష్ప ది రూల్ లో సాయి పల్లవి కీలక పాత్ర చేస్తోందని వచ్చిన వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ ను పటాపంచలు చేస్తూ సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి.. తాను పుష్ప సెకండ్ పార్టులో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే ఆ సినిమాలో ఉన్నానని అన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానని పేర్కొంది.

పుష్ప కంటే పుష్ప 2 మరింత బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు. సాంగ్స్, డైలాగ్స్ తో సుకుమార్ మరోసారి సూపర్ డూపర్ హిట్టు కొడతారని అంచనా వేస్తున్నారు.

పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్టిలో ఉంచుకొని పుష్ప 2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట చిత్రబృందం. కేవలం ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకొని 2024 వేసవిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తోందట. రష్యాలో కూడా పుష్ప2 ను విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2024 వేసవిలో రిలీజ్ కు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియాతో పాటు అమెరికా, రష్యా వంటి దేశాల్లో కూడా పుష్ప భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. దేశ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తే.. కేవలం హిందీలోనే 100 కోట్ల రూపాయలను సంపాదించింది. మరి పుష్ప-2 ఏ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయబోతుందో తెలియాలంటే ఇంకో ఏడాది ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.