మెగా హీరోని సపోర్ట్ చేస్తూ ‘నో పెళ్లి’ అంటున్న టాలీవుడ్ సింగర్స్...!

Fri Jun 05 2020 19:30:46 GMT+0530 (IST)

Tollywood singars covered no pelli song

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. ఈ చిత్రంలో తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడదులై ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ థీమ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రం నుంచి ‘నో పెళ్లి’ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. థమన్ స్వరపరచిన ఈ సాంగ్ ద్వారా బ్యాచిలర్ జీవితమే గొప్పదంటూ.. పెళ్లి చేసుకోవద్దంటూ మెగా మేనల్లుడు సాయి తేజ్ తెలిపాడు. ఈ పాటలో తేజ్ తో పాటు టాలీవుడ్ హీరోలు రానా వరుణ్ తేజ్ లు కూడా కనిపించి అలరించారు. ‘నో పెళ్లి’ సాంగ్ యూట్యూబ్ లో 5 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా 'నో పెళ్లి' సాంగ్ కవర్ వర్షన్ ను రిలీజ్ చేసింది 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్ర యూనిట్. ఇందులో దీపు శ్రీరామ్ చంద్ర ధనుంజయ్ రంజిత్ రమ్య బెహరా సాకేత్ లిప్సికా మనీషా గీతా మాధురి టిప్పు శ్రీ కృష్ణ రోల్ రైడా సహా పలువురు సింగర్లు పాల్గొన్నారు. ఈ కవర్ సాంగ్ లో కనిపిస్తున్న వారిలో కొంతమంది పెళ్ళైన వారు ఉండగా మరికొందరు పెళ్లి కాని సింగర్స్ ఉన్నారు. టాలీవుడ్ ప్రముఖ గాయనీ గాయకులు అందరూ ఒకే సాంగ్ లో కనిపించడంతో సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'నో పెళ్లి' కవర్ సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ ని బ్యాచిలర్స్ సింగిల్స్ తమ కాలర్ ట్యూన్స్ గా సెట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తమన్ కంపోజ్ చేసిన ఈ 'నో పెళ్లి' సాంగ్ కి రఘురామ్ లిరిక్స్ అందించాడు. అర్మన్ మాలిక్ ఈ పాటను అద్భుతంగా ఆలపించగా యశ్వంత్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేసారు. కాగా ఇప్పటికే ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ మూతబడిపోవడంతో వాయిదా పడింది.