Begin typing your search above and press return to search.

పెద్దమ్మతల్లి ఆశీర్వాదంతో సాయి తేజ ప్రియాంకగా..!

By:  Tupaki Desk   |   14 Oct 2021 11:30 AM GMT
పెద్దమ్మతల్లి ఆశీర్వాదంతో సాయి తేజ ప్రియాంకగా..!
X
జబర్దస్త్‌ లో లేడీ గేటప్‌ తో కమెడియన్ గా గుర్తింపు దక్కించుకున్న సాయి తేజ ఆ తర్వాత నిజంగానే అమ్మాయిగా మారడం జరిగింది. సాయి తేజ కాస్త ప్రియాంక సింగ్ గా మారింది. గత కొన్నాళ్లుగా యూట్యూబ్‌ ద్వారా.. ఇతర షో ల ద్వారా సందడి చేస్తూ వస్తున్న ప్రియాంక సింగ్ ప్రస్తుతం బిగ్‌ బాస్ లో సందడి చేస్తోంది. ట్రాన్స్ జెండర్ అనగానే చాలా మంది చాలా రకాలుగా అభిప్రాయాలను కలిగి ఉంటారు. కాని ప్రియాంక ఆ అభిప్రాయాలు నిజం కాదని నిరూపించింది. బిగ్‌ బాస్ ఇంతకు ముందు సీజన్ లో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి కాస్త ఓవర్‌ యాక్షన్ చేసింది. దాంతో చాలా మంది ట్రాన్స్ జెండర్స్ అంతా కూడా ఇలాగే ఉంటారనే అభిప్రాయంకు వచ్చారు. అలాంటి సమయంలో ప్రియాంక సింగ్‌ అందరిని ఒక మంచి రిలేషన్ తో కలుపుకు పోవడంతో పాటు ప్రతి ఒక్కరి గురించి కూడా కేరింగ్‌ చూపడం తో ఆమెను ప్రేక్షకులు ఆధరిస్తున్నారు.

ట్రాన్స్‌ జెండర్‌ గా మారిన విషయంను కుటుంబంలో చాలా రోజులు తెలియకుండా జాగ్రత్త పడిందట ప్రియాంక. అంతే కాకుండా అంధుడు అయిన తన తండ్రికి మొన్నటి వరకు తాను ట్రాన్స్ జెండర్‌ గా మారిన విషయాన్ని చెప్పలేదు. బిగ్‌ బాస్ లోకి వచ్చిన తర్వాతే ఆయనకు ఆ విషయం తెలిసింది. ఆయన కూడా అందుకు ఒప్పుకోవడం కూడా జరిగింది. బిగ్‌ బాస్‌ లో ఇటీవల ఆ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యి అందరికి కన్నీరు వచ్చేలా చేసింది. ట్రాన్స్ జెండర్‌ గా మారడం వెనుక చాలా పెద్ద యుద్దమే జరిగిందని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఎంతో ఆలోచించి.. ఏ నిర్ణయం తీసుకోలేని సమయంలో పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.

పెద్దమ్మ తల్లి గుడిలో ఒక రోజు తన నిర్ణయం సరైనదేనా అనే సందేహం లో ఉన్న సమయంలో కాయిన్‌ ను నిలబెట్టి కోరిక కోరుకున్నాను. గుడిలో కాయిన్‌ నిల్చోబెట్టి కాయిన్‌ నిలబెట్టాల్సి ఉంటుంది. అది నిలబడితే అప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది. పెద్దమ్మ తల్లి వద్ద నేను నిల్చోబెట్టిన కాయిన్ నిల్చోవడంతో నా నిర్ణయానికి అమ్మ ఆశీర్వాదం ఉందనే ఉద్దేశ్యంతో నేను ముందుకు వెళ్లాను. అమ్మ ఆశీర్వాదంతో అంతా సాఫీగా సాగిందంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ తర్వాత ప్రియాంక సింగ్‌ సినిమాల్లో చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.