Begin typing your search above and press return to search.
పవన్ ఫ్యాన్స్ కి దర్శకుడి సలహా.. మంచి చేయకున్నా చెడు చేయవద్దు
By: Tupaki Desk | 6 Feb 2023 8:00 PMబాలకృష్ణ అన్నట్లు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కు అభిమాని కానివారు లేరు.. అంతటి అభిమానగనం ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేప్పటికి చాలా ఢీలా పడిపోతున్నాడు. అభిమానులు అంతా కూడా రాజకీయాల వైపు చూసే అవకాశం లేదు.. అభిమానంతో ఓట్లు వేసే అవకాశాలు కూడా లేవు. అయితే సాదారణ జనాలు పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా నమ్మడం లేదు అనే టాక్ వినిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఒక అభిప్రాయం జనాల్లో ఉంది. కనుక ఫ్యాన్స్ కు ఉన్న పేరు కారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎంత ఉన్నతంగా చేయాలి అనుకున్నా కూడా జనాలు ఓట్ల రూపంలో పవన్ కు మద్దతు తెలిపేందుకు ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది కూడా పవన్ అభిమానులను విమర్శిస్తూ ఉంటారు.
తాజాగా కలర్ ఫొటో చిత్ర నిర్మాత సాయి రాజేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. మీరు ఫ్యాన్ వార్ కి వెళ్లడం వల్ల వేరే హీరోల ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కు దూరం అవుతున్నారు. తద్వారా రాజకీయంగా పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బంది పడుతున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ట్విట్టర్ లో సాయి రాజేష్ షేర్ చేసిన ట్వీట్ లో.. గత సంవత్సర కాలంగా, నాగబాబు గారి ద్వారా అయితే కానీ, కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులుగా మెలిగే వ్యక్తులతో కానీ, వారి ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే.. క్షణం తీరిక లేకుండా ప్రజా సేవ కార్యక్రమాలు చేస్తూ కూడా.. కళ్యాణ్ గారు ఇన్ని సినిమాలు చేయటానికి కారణం జనసేన ఆర్థికంగా బలంగా లేకపోవటమే.
ఓటు బ్యాంకు రాజకీయాలు క్రేజ్ మీద నడవవు. సినిమా పరిశ్రమలో ఉంటూ ఓ సైడ్ తీసుకోకూడదనుకునే నాలాంటి వాళ్లమే ఆయన కష్టం చూసి జల్సా స్పెషల్ షోస్ వంటివి మా వంతుగా చేశాం. మీరు మంచి చేయక పోయినా పర్లేదు. హాని చేయకండి. ఆయనకి, పార్టీకి సినిమాలు మాత్రమే చూసుకుని ఉండండి. కానీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత, ఒక మాట పడాల్సి వచ్చినప్పుడు ఆలోచించాల్సిన సిచ్యువేషన్‌లో మీరున్నారు.
ఫ్యాన్ వార్‌లో తాత్కాలిక గెలుపు కోసం ప్రయత్నిస్తే, చాలా మంది మనుషుల్లో కళ్యాణ్ గారి పట్ల, పార్టీ పట్ల శాశ్వతమైన శత్రుత్వం కలిగిస్తున్నారు. మేం ఆయన సినిమాలకు మాత్రమే అభిమానులం అనుకునే వారికి కాదు ఈ పోస్ట్. మా హీరో, ఆయన పార్టీ బాగుండాలని కోరుకునే నాకు తెలిసిన అతి కొద్ది మంది సెన్సిబుల్ అభిమానులకి ఈ రిక్వెస్ట్. ఇక ఆపండి. ఫుల్ స్టాప్ పెట్టేయండి. లేదా మీరు మాత్రం గొడవలకు దూరంగా ఉండండి. ఇక్కడ ఎవరూ తగ్గేది లేదు, పెరిగేది లేదు అంటూ పేర్కొన్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.