Begin typing your search above and press return to search.

ధనుష్ క్రేజీ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి?

By:  Tupaki Desk   |   29 Jan 2023 6:00 AM GMT
ధనుష్ క్రేజీ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి?
X
సౌత్ ఇండియాలో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి సాయి పల్లవి. చేసినవి తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకి భాగా గుర్తుండిపోయే పాత్రలలో ఆమె అలరించింది ఫిదా, లవ్ స్టొరీ, విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్, మారి 2 సినిమాలు ఆమె పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది అందరికి పరిచయం చేశాయి. స్టార్ హీరోయిన్ అయినా కమర్షియల్ సినిమాలు చేసే అవకాశం వచ్చిన కూడా ఇష్టానుసారంగా ఒప్పుకోకుండా సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటూ సాయి పల్లవి నటిగా కెరియర్ కొనసాగిస్తుంది.

తనకి నచ్చే కథలని మాత్రమే ఒప్పుకుంటూ హీరోయిన్ గా ట్రావెల్ అవుతుంది. తన పాత్రకి కచ్చితంగా గుర్తింపు వస్తుంది అనుకుంటేనే రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా చిన్న సినిమా అయినా పర్లేదు అనుకుంటూ చేస్తుంది.

సాయి పల్లవిలో ఉన్న ఈ క్వాలిటీ కారణంగానే ఆమె అందరికి అందుబాటులో ఉన్న హీరోయిన్ గా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఏమీ లేవు. అలా అయిన ఆమె తొందరపడటం లేదు. మనసుకి నచ్చే సినిమా వచ్చినప్పుడే చేద్దాం అంటూ కథలు వింటుంది.

ఈ నేపధ్యంలో ఈ బ్యూటీకి కోలీవుడ్ రెండు భారీ చిత్రాల ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తుంది. అందులో అజిత్ కుమార్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీ ఒకటి. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.

అయితే అఫీసియల్ గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. ధనుష్ కెరియర్ లో 50వ సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్ లో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాని ధనుష్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవల్ లో సుమారు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తుంది. ధనుష్, సాయి పల్లవి కాంబోలో వచ్చిన మారి 2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వీరి జోడికి ఇండియన్ వైడ్ గా క్రేజ్ ఉంది. రౌడీ బేబీ సాంగ్ తో భాగా పాపులర్ అయ్యారు. ఈ నేపధ్యంలో ధనుష్ తన 50వ సినిమా కోసం సాయి పల్లవిని ఫైనల్ చేసే యోచనలో ఉన్నట్లుగా కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.