Begin typing your search above and press return to search.
సాయి పల్లవి.. అసలు మ్యాటర్ ఇదన్నమాట
By: Tupaki Desk | 2 Jun 2023 10:00 AMటాలీవుడ్ కి దొరికిన అత్యంత అరుదైన, ఉత్తమమైన హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఆమెకు ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. సాయి పల్లవి ఉందంటే ఆ సినిమా హిట్ అనే భావన జనాల్లో చాలా ఎక్కువ. కేవలం ఆమె కోసమే సినిమాలు చూసేవారు కూడా ఉన్నారు. అందుకే ఆమె ను లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చారు. అలా అని ఆమె అందరు హీరోయిన్లలా పొట్టి దుస్తులు, ఎక్స్ పోజింగ్ లాంటివి ఏమీ చేయదు. కేవలం తన నటన, డ్యాన్స్ , ఎంచుకున్న పాత్రల ద్వారానే ఈ క్రేజ్ సంపాదించుకుంది.
అయితే, ఈ మధ్య టాలీవుడ్ లో సాయి పల్లవి కనిపించడం లేదు. విరాట పర్వం, గార్గి వంటి సినిమాల తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా ఆమె ఒకే చేయలేదు. దీంతో ఫ్యాన్స్ చాలా ఆందోళన కు గురయ్యారు. సాయి పల్లవి ని ఎందుకు హీరోయిన్ గా తీసుకోవడం లేదు అని అనుకున్నారు. కానీ అసలు విషయాన్ని ఆమె తాజాగా తెలియజేశారు.
తనకు సినిమాల నుంచి ఎలాంటి గ్యాప్ రాలేదని చెప్పారు. అవకాశాలు లేకపోవడం వల్ల కాదని, తానే కావాలని కొంత కాలం గ్యాప్ తీసుకోవాలని తీసుకున్నానని ఆమె చెప్పారు. కొద్ది రోజులు సినిమా షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకుందామనుకునే ఏ సినిమా ఒప్పుకోలేదని చెప్పారు.
వచ్చిన ప్రతి ఆఫర్ ని సాయి పల్లవి అంగీకరించదు. సాధారణ కమర్షియల్ సినిమాల్లో ముఖ్యంగా హీరో పక్కన కేవలం డ్యాన్సులు చేసే పాత్రల ను ఆమె తొందరగా యాక్సెప్ట్ చేయరు. తన నటకు ప్రాధాన్యత ఉన్నవి మాత్రమే ఎంచుకుంటారు. సరైన పాత్ర దొరకకపోవడం వల్ల కూడా ఆమె కొత్తగా ఏ సినిమా అంగీకరించలేదని తెలుస్తోంది. కమర్షియల్ మూవీలు అంగీకరించే నటి అయ్యింటే, సాయి పల్లవి కెరీర్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలు ఉండేవి. కానీ ఆమె సినిమా కథతో పాటు తన పాత్ర ప్రాముఖ్యత గురించి ఆలోచించి మూవీ ఎంపిక చేసుకుంటారు. అందుకే ఆలస్యమైందని తెలుస్తోంది.
కాగా, చాలా కాలంగా ఆమె తెర పై కనిపించలేదని ఫ్యాన్స్ బాధపుడుతున్నారు. కానీ త్వరలోనే ఆమె ఓ సినిమాతో ప్రేక్షకుల ను పలకరించున్నారు. తమిళనాట కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కబోయే శివ కార్తికేయన్ మూవీ లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా లో ఆమె పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.