ఈ కాలంలో ఇలాంటి హీరోయిన్స్ ఉంటారా?

Mon Jul 06 2020 06:00:01 GMT+0530 (IST)

Sai Pallavi Rejects For Lip Lock Scenes

టాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా స్టార్స్ పారితోషికం కోసమే నటిస్తున్నారు. ఒకప్పుడు నటనపై ఆసక్తితో నటించే వారు. కాని ఇప్పుడు కోట్లు వస్తాయనే ఉద్దేశ్యంతో మాత్రమే నటించేందుకు ఇండస్ట్రీకి వస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క సినిమా సక్సెస్ అయితే హీరోయిన్స్ తమ పారితోషికాన్ని ఆకాశాన ఉంచుతున్నారు. స్టార్ హీరోలతో నటించేందుకు కోట్లు డిమాండ్ చేసి వసూళ్లు చేస్తున్నారు. కాస్త క్రేజ్ ఉండి స్కిన్ షో ముద్దు సీన్స్ ఉంటే కోట్లు అదనంగా తీసుకుంటారు.ఇలా అందరు హీరోయిన్స్ ఉంటారని కాదు. ఒక్కరు ఇద్దరు కాస్త విభిన్నంగా కూడా ఉంటారు. నిత్యామీనన్ మంచి క్రేజ్ వచ్చినా కూడా స్కిన్ షో తో స్టార్ డం సాధించాలని ప్రయత్నించలేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న సాయి పల్లవి స్కిన్ షో ముద్దు సీన్స్ తో కోట్ల పారితోషికం దక్కించుకునే అవకాశం ఉన్నా కూడా వాటిని చాలా లైట్ తీసుకుంటుంది.

సాయి పల్లవి హీరోయిన్ గా ఈమద్య కాలంలో చాలా ఆఫర్లు వచ్చాయట. కాని ఈమె మాత్రం నటనకు ఆస్కారం ఉండాలి.. కథలో ప్రాముఖ్యత ఉండాలి చివరగా స్కిన్ షో లేకుండా ఉండాలంటూ కండీషన్స్ పెడుతుందట. ఇక ముద్దు సీన్స్ అంటే అసలు కథ వినేందుకు కూడా ఆసక్తి చూపడం లేదట. అంతగా ఈ అమ్మడు మడి కట్టుకుని ఉంటుంది. హీరోయిన్స్ ఈమద్య మరీ విచ్చలవిడిగా తయారు అయ్యారు. సాయి పల్లవిని చూస్తుంటే ఇంకా ఇలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఉన్నారా అంటూ అనుమానం కలుగుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.