2 కోట్లు.. కానీ కూల్ గా వద్దని చెప్పిందట!

Mon Apr 15 2019 18:17:18 GMT+0530 (IST)

Sai Pallavi Rejected a 2 Crore Deal

అందరూ హీరోయిన్లు ఒకలా ఉండరు. అందులోనూ ముఖ్యంగా సాయి పల్లవి రూటే సపరేటు.  యాక్టింగ్ లో.. డ్యాన్స్ లో సాయి పల్లవి దరిదాపుల్లోకి రాగలిగే హీరోయిన్లు చాలా తక్కువమంది ఉంటారని అందరికీ తెలిసిందే.  కానీ సాయి పల్లవి తన పాత్రలను ఆషామాషీగా ఎంచుకోదు.  తన పాత్ర నచ్చకపోతే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా 'నో' చెప్తుందనే టాక్ ఉంది.  కొంతమంది కొన్ని దానిని గర్వం అని కూడా అంటూ ఉంటారు.  అయినా సాయి పల్లవి అలాంటివి అసలు పట్టించుకోదు.  అది తనమీద తనకు ఉన్న కాన్ఫిడెన్సా లేదా గర్వమా ఏమో తెలీదు కానీ తాజాగా మరోసారి ఒక భారీ ఆఫర్ ను తిరస్కరించిందట.సాయి పల్లవి ఈసారి రిజెక్ట్ చేసింది సినిమా ఆఫర్ కాదు.. యాడ్ ఆఫర్.  ఈమధ్య ఒక ప్రముఖ కాస్మెటిక్స్ కంపెనీవారు తాము కొత్తగా లాంచ్ చేయనున్న ఫేస్ క్రీమ్ కు బ్రాండ్ అంబాజిడర్ గా వ్యవహరించమంటూ సాయిపల్లవిని సంప్రదించారట. ఈ డీల్ సైన్ చేస్తే రూ. 2 కోట్లు రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట.  కానీ సాయి పల్లవి మాత్రం వారికి 'నో' చెప్పిందట. సాయి పల్లవి దాదాపుగా మేకప్ లేకుండా సహజంగా నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందుకే సినిమాలో తన ఫేస్ పై మొటిమలు అలానే కనిపిస్తాయి.  మరి తనే మేకప్ వేసుకోకుండా న్యాచురల్ గా సినిమాల్లో నటిస్తుంటే ఇప్పుడు ఈ ఫేస్ క్రీమ్ కు ప్రమోషన్స్ చేయడం సరికాదు అనిపించి ఆ భారీ ఆఫర్ ను వద్దనుకుందట.

యాడ్ షూటింగ్ కు మహా అయితే రెండు రోజుల కాల్ షీట్స్.. పెద్దగా కష్టపడకుండానే రెండు కోట్లు వచ్చి పడుతుంటే ఇలా వద్దనే మనుషులు ఈ జెనరేషన్ లో ఉంటారా? ఈ విషయంలోనే కాదు.  'పడి పడి లేచే మనసు' కు బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా కొద్దిరోజుల క్రితం అందరినీ సర్ ప్రైజ్ చేసింది.  ఒక్కటి మాత్రం నిజం.. అందరూ హీరోయిన్లు వేరు.. సాయి పల్లవి వేరు.  కమ్ముల సారు అందుకే సరిగ్గా సాయిపల్లవికి 'హైబ్రిడ్ పిల్ల' అనే పేరు పెట్టారు.  దీని సంగతి పక్కన పెడితే సాయి పల్లవి సూర్య సినిమా 'NGK' లోనూ.. రానా దగ్గుబాటి 'విరాటపర్వం' లోనూ హీరోయిన్ గా నటిస్తోంది.