షాక్: ఐటెమ్ ప్లీజ్ అంటూ వెంటపడుతున్నారట!

Mon Jul 13 2020 12:40:23 GMT+0530 (IST)

Sai Pallavi Gets Offered An Item Song!

ఐటెమ్ పాటకు కొరియోగ్రఫీ చేయడం అంటే ఆషామాషీనా? బావల సయ్యా.. మరదలు సయ్యా!! అంటే ఉయ్ ఉయ్ అంటూ.. గోల గోలగా గగ్గోలు పెట్టాలి బావలంతా.  కెవ్వు కేక అంటూ మాంచి ఊపు తేగలగాలి మలైకా రేంజులో. బాడీలో రిథమ్.. ఒళ్లంతా షివరింగ్ పుట్టాలి. స్క్రింగులాగా సాగాలి.. అందాల ఎలివేషన్ కి ఆస్కారం ఉన్న ఒడుపైన స్టెప్ ని కంపోజ్ చేయగలగాలి.మలైకా అరోరా ఖాన్ .. కత్రిన కైఫ్.. సన్నీలియోన్ .. వీళ్లంతా ఇలాంటి వాటిలో ఎక్స్ పర్ట్స్ అని ప్రూవైంది. జాక్విలిన్ ఫెర్నాండెజ్ లాంటి మోడ్రన్ బ్యూటీ ట్రై చేసినా జనం మెచ్చలేదు. అయితే అలాంటి ఛాలెంజింగ్ ఐటెమ్ నంబర్ కి కొరియోగ్రఫీ చేసేందుకు సౌత్ ట్యాలెంటెడ్ గాళ్ సాయి పల్లవి అంగీకరించిందని సమాచారం. సహజంగానే సాయి పల్లవి మంచి డ్యాన్సర్ కావడంతో సాంగ్ కంపోజింగ్ చేయాలంటూ తన వెంట పడుతున్నారట. డ్యాన్స్ రియాలిటీ షోల నుంచి వచ్చిన అనుభవంతో ఈ బ్యూటీ అందుకు సై అనేస్తోంది. ఇక యూట్యూబ్ లో బెస్ట్ స్ట్రీమింగ్ డ్యాన్స్ నంబర్ ఈ అమ్మడి ఖాతాలోనే ఉన్న సంగతి తెలిసిందే.

స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సాయి పల్లవి ప్రస్తుతం నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలకు సంతకాలు చేస్తోంది. అలాగే `ఫిదా`లో నైజాం బ్యూటీగా పాపులరయ్యాక ఆ తరహా ఆఫర్ వస్తే వదలడం లేదు. కమ్ముల రెడీ అంటే ఆ తరహా పాత్రలకు సంతకాలు చేస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య సరసన లవ్ స్టోరీ ఈ కేటగిరీనే. ఇక ఈ మూవీ చేస్తూనే ఓ ఐటెమ్ నంబర్ కి కంపోజ్ చేసేందుకు దిల్ రాజుకు ఓకే చెప్పిందట. అదీ కూడా ఓన్లీ దిల్ రాజుకు మాత్రమే ఈ ఆఫర్. ఇంకెవ్వరి సినిమాలకి చేయదట. ఇప్పటికే వరుణ్ తేజ్ రిక్వెస్ట్ పై సాయి పల్లవి `గద్దల కొండ గణేశ్` సినిమాలో ఐటమ్ నెంబర్ కు స్టెప్పులు కంపోజ్ చేసిందట. ఇది చూసి దిల్ రాజు కూడా అడిగే సరికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు సమాచారం. సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు డీ షోలో టైటిల్ విన్నర్ అయిన సంగతి తెలిసిందే..! డాన్స్ బాగా వచ్చు కాబ్బట్టే ప్రేమమ్ ఆఫర్ సాయిపల్లవి తలుపు తట్టింది. అటుపై కెరీర్ సంగతి తెలిసిందే.