Begin typing your search above and press return to search.

రౌడీ బేబీ కోసం.. ఎదురు చూస్తున్న‌ బాలీవుడ్!

By:  Tupaki Desk   |   16 Jun 2021 5:30 PM GMT
రౌడీ బేబీ కోసం.. ఎదురు చూస్తున్న‌ బాలీవుడ్!
X
సాయి పల్లవి టాలెంట్ గురించి స్పెష‌ల్ గా ఇంట్రుడ్యూస్ చేయాల్సిన ప‌నిలేదు. ఈ నేచుర‌ల్ బ్యూటీ నటనకు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులూ ఫిదా అవుతున్నారు. ఇక, ఈ బ్యూటీ పాదం కదిపితే ఆ లెక్కే వేరు. సహజంగానే డ్యాన్సర్ అయిన సాయి పల్లవి.. సినిమాల్లో వేసే స్టెప్పులకు ఫ్యాన్స్ ఈల వేసి గోల చేస్తుంటారు. త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుందీ బ్యూటీ.

అయితే.. ఈ అమ్మ‌డు డ‌బ్బే ప్ర‌ధానంగా సినిమాలు చేసే ర‌కం కాదు. త‌న క్యారెక్ట‌ర్ న‌చ్చాలి. స‌మ్ థింగ్ డిఫ‌రెంట్ అనిపిస్తే త‌ప్ప‌.. సినిమాకు సైన్ చేయ‌దు. ఆ విధంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో చిత్రాలు వ‌దిలేసుకుంది. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా.. సెల‌క్టివ్ సినిమాల‌ను ఎంచుకునే సాయిప‌ల్ల‌వి.. మెజారిటీగా హిట్ల‌నే త‌న ఖాతాలో వేసుకుంటోంది.

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమంటే.. సాయి ప‌ల్ల‌వి టాలెంట్ బాలీవుడ్ ను సైతం ఆక‌ర్షించింది. అక్క‌డి నుంచి చాలా సినిమా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌. లేటెస్ట్ గా ఓ ప్ర‌ముఖ బ్యాన‌ర్ కూడా ఈ బ్యూటీని కాంటాక్ట్ అయ్యింద‌ని టాక్‌. బాలీవుడ్ కు వెళ్ల‌డానికి ఈ అమ్మ‌డు కూడా సిద్ధంగానే ఉంద‌ని తెలుస్తోంది. అయితే.. ఖ‌చ్చితంగా క‌థ మాత్రం న‌చ్చాల్సిందే. అన్నీ ఒకే అయితే.. త్వ‌ర‌లోనే ఈ కేర‌ళ కుట్టి బాలీవుడ్ లో అడుగు పెట్ట‌డం ఖాయ‌మేనట‌.

కాగా.. టాలీవుడ్ లో సాయిప‌ల్లవి న‌టించిన రెండు చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కానున్నాయి. అందులో నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన ‘ల‌వ్ స్టోరీ’ ఒక‌టికాగా.. రానాతో న‌టించిన విప్ల‌వ చిత్రం విరాట ప‌ర్వం రెండోది. ప్ర‌స్తుతానికి ఈ రెండు చిత్రాల‌పైనా పాజిటివ్ ఎక్స్ పెక్టేష‌న్సే ఉన్నాయి.