Begin typing your search above and press return to search.
సాయి పల్లవి కూడా మహేష్ లాగే ఉంటుందా?
By: Tupaki Desk | 8 Jun 2023 7:00 AMసూపర్ స్టార్ మహేష్ డే షూటింగ్ ముగిసిందంటే? మళ్లీ ఇంట్లో సినిమా ప్రస్తావన అనేదే ఉండదు. సెట్స్ లో ఉన్నంత సేపు షూటింగ్ హడావుడి.. ప్యాకప్ చెప్పి ఇంటికొచ్చిన తర్వాత ఫ్యామిలీ తప్ప! మరో విషయం మైండ్ లోకి రానివ్వరు.
ఈ విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కోట్ల రూపాయలు ఇవ్వని సంతోషం ఒక్క కుటుంబం ఇస్తుందని...అలాంటప్పుడు కోట్లు కన్నా! కుటుంబం ముఖ్యం..ఆ కుటుంబం సంతోషంగా ఉండటం కోసం కొన్ని గంటల పాటు సినిమాకి దూరంగా ఉండటంలో తప్పేం లేదంటారు.
ఇక స్టోరీలు వినడానికి ..వాటికి సంతకం చేసే వ్యవహారాలకు ప్రత్యేకమైన సమయం ఉంటుంది. అప్పుడే వాటి గురించి ఆలోచిస్తారు. ఇలా మహేష్ రీల్..రియల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ కొన్నేళ్లగా ముందుకు సాగుతున్నారు. తాజాగా యంగ్ బ్యూటీ సాయి పల్లవి మాటలు వింటే మహేష్ వ్యాఖ్యలకు గుర్తుకు రావడం ఖాయం. అవును..అచ్చం ప్లానింగ్ విషయంలో మహేష్ లాగే స్పందించింది.
'పనిలో ఆనందాన్ని వెతుకుతున్నప్పుడు ఆ పని చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. అలాగని దాన్నే వ్యక్తిగత జీవితంలోకి తీసుకురాకూడదు. వృత్తిని..వ్యక్తిగత జీవితాన్ని వేర్వేరుగా చూసినప్పుడే మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
నేను ఏ సినిమా చేసినా సరే సాయంత్రం అయ్యే సరికి ఆ సినిమా షూటింగ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తా. మళ్లీ సినిమా అనే విషయం నా మైండ్ లోకి రాకుండా చేస్తా. తిరిగి మళ్లీ సెట్స్ లో అడుగు పెట్టినప్పుడు నిజ జీవితాన్ని పూర్తిగా మర్చిపోతా.
సెట్స్ లో ఉన్నంత సేపు ఆ సినిమాలో పాత్రలాగే జీవిస్తా. ఏ విషయంలోనైనా ఆ సమయానికి తగ్గట్లుగా దేనికి ఇచ్చే ప్రాధాన్యత దానికి ఇవ్వగలిగినప్పుడే పనిపూ పూర్తి శ్రద్ద చూపించగలం. మనసును ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే అత్యుత్తమ ఫలితాలు సాధించగల్గుతాం. ఎన్ని కోట్లు వచ్చినా మన మనసు సంతోషంగా లేనప్పుడు ఆ కోట్లు వచ్చినంత మాత్రాన లేని సంతోషం రాదు కదా' అంది.