Begin typing your search above and press return to search.

చిరు అన్నయ్య మీరన్నట్లే కొత్తగా చేశాను

By:  Tupaki Desk   |   29 July 2021 3:56 AM GMT
చిరు అన్నయ్య మీరన్నట్లే కొత్తగా చేశాను
X
సినీ నటుడు సాయి కుమార్ దాదాపుగా అయిదు దశాబ్దాల సినీ ప్రస్థానంను పూర్తి చేసుకోబోతున్నారు. బాల నటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన ఆరు పదుల వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. బాల నటుడిగా.. హీరోగా.. విలన్‌ గా.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో రకాలుగా ఆయన తెరపై కనిపించారు. అయితే ఈమద్య కాలంలో ఒకే తరహా పాత్రలతో ఆయన బోర్‌ కొట్టిస్తున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక రెగ్యులర్‌ విలన్‌ పాత్రలో లేదంటే రెగ్యులర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మాత్రమే ఆయన కనిపిస్తూ వస్తున్నారు. ప్రేక్షకులు సాయికుమార్‌ అంటే ఇక అలాంటి పాత్రలే అనుకుంటూ ఉన్న సమయంలో విభిన్నమైన పాత్రలో నటించానంటూ ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం సినిమా ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశాడు.

కిరణ్‌ అబ్బవరం హీరోగా ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్‌ గా నటించిన ఎస్ ఆర్‌ కళ్యాణ మండపం సినిమా లో సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించారు. సినిమా ట్రైలర్ చూస్తే ఆయన తాగుబోతుగా ఈ సినిమాలో నటించినట్లుగా కనిపిస్తుంది. సినిమా ట్రైలర్ విడుదల సందర్బంగా సాయి కుమార్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి అన్నయ్య చిరంజీవి నాతో ఎంట్రా ఎప్పుడు ఒకే తరహా పాత్రలు చేస్తున్నావు.. కొత్తగా ట్రై చేయ్‌ అన్నారు. అన్నయ్య ఈ సినిమాలో నేను కొత్తగా చేశాను.. మీరు అన్నట్లుగానే నేను ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నాను అంటూ సాయి కుమార్ వ్యాఖ్యలు చేశాడు.

శ్రీదర్‌ గాదె దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నటుడిగా మంచి పేరును దక్కించుకున్న కిరణ్‌ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు స్వయంగా ఆయనే కథను అందించడం ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో హీరో పాత్రకు తండ్రి గా సాయి కుమార్‌ నటించాడు. తాగి బాధ్యతగా వ్యవహరించని పాత్రలో సాయి కుమార్ నటించాడట. అయితే ఆ పాత్ర వెనుక చాలా బలమైన ఫ్ల్యాష్‌ బ్యాక్ ఉటుందని కూడా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.