సాయిధరమ్ తేజ్ ఆపరేషన్ సక్సెస్

Sun Sep 12 2021 14:14:00 GMT+0530 (IST)

Sai Dharam tej  Operation Success

రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు విజయవంతంగా ‘కాలర్ బోన్’ శస్త్రచికిత్స పూర్తయినట్టు వైద్యులు తెలిపారు. గత మూడు రోజుల నుంచి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో సాయిధరమ్ తేజ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం మధ్యాహ్నం వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.  ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని చెప్పారు.

ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం సాయిధరమ్ తేజ్ కు కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సాయితేజ్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

శుక్రవారం రాత్రి తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు సాయిధరమ్ తేజ్ వెళుతుండగా ఇసుక కారణంగా ఆయన నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ నుంచి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి.  సాయితేజ్ ను ఆస్పత్రికి తరలించగా ఈరోజు కాలర్ బోన్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు.

ఇక సాయితేజ్ ను పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చి పరామర్శించారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.