విరుపాక్ష.. ఓ పనైపోయింది!

Fri Mar 31 2023 15:24:53 GMT+0530 (India Standard Time)

Sai Dharam Tej Virupaksha

టాలీవుడ్ యువ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం విరూపాక్ష. సుకూమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో SDT15వ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రం మిస్టిరియల్ థ్రిల్లర్గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంపై సాయి ధరమ్ తేజ్.. అటు అభిమానులు భారీ గానే అంఛనాలు పెట్టుకున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. పూర్తి స్థాయి ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈ చిత్రం ఏప్రిల్ 21 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. విరూపాక్ష తెలుగు తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. విరూపాక్షలో మలయాళ భామ సంయుక్తా మీనన్... సాయి ధరమ్ తేజ్ సరసన ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీకి కాంతార ఫేం అంజనీశ్ లోక్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు.

మరోవైపు సుకుమార్ శిక్షులు అందరు తమ సినిమాలతో సత్తా చాటుతున్నారు. మొన్న బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ను అందుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల కూడా అలాంటి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు కార్తీక్ దండు వంతు రాబోతుంది. ఈయన ఎలాంటి హిట్ అందుకోనున్నాడో చూడాలి. మొత్తానికి అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ అజయ్ సునీల్ విరూపాక్షలో కీలక పాత్రలు నటిస్తున్నారు. విరూపాక్షతో పాటు సాయి ధరమ్ తేజ్ మరో వైపు సముద్ర ఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.