మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడింది

Fri Dec 02 2022 19:27:03 GMT+0530 (India Standard Time)

Sai Dharam Tej Starts Another Project Backed By SVCC

మెగా హీరోలు అందరూ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. సక్సెస్ ఫ్లాప్ లతో సంబంధం లేదు అన్నట్లుగా మెగా హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్న ఈ సమయంలో గత రెండు సంవత్సరాలుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమా చేయక పోవడం పట్ల అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు.2021 సంవత్సరంలో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అవ్వడంతో తీవ్రంగా గాయ పడ్డాడు. సాయి ధరమ్ తేజ్ ప్రాణాలతో బయట పడుతాడా అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలో తేజ్ ఆరోగ్యం గురించి రకరకాలుగా రచ్చ జరిగింది.

ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను అంటూ ఒక వీడియో విడుదల చేసి మీడియా ముందుకు వచ్చేప్పటి వరకు రకరకాలుగా ప్రచారం జరిగింది. తేజ్ ఆరోగ్యంగా ఉన్నాడు కదా.. తదుపరి సినిమా ఎప్పుడు ప్రారంభం అయ్యేది అంటూ మెగా ఫ్యాన్స్ తో పాటు ఆయన సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఎదురు చూశారు.

ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమా ప్రారంభం అయ్యింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో తేజ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు జయంత్ పానుగంటి దర్శకత్వం వహించబోతున్నాడు. సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంచనంగా జరిగాయి. చిత్ర యూనిట్ సభ్యులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అతి త్వరలోనే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవ్వబోతుందని.. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్ నటించబోతున్న వినోదయ్య సిత్తం సినిమా రీమేక్ లో కూడా సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడట. ఆ సినిమా విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.