స్క్రిప్టుల విషయంలో జాగ్రత్తపడుతున్నాడట!

Fri Dec 06 2019 17:37:02 GMT+0530 (IST)

Sai Dharam Tej Realise on about Movie Scripts

మెగా ఫ్యామిలీ హీరోలకు సక్సెస్ రేట్ ఎక్కువే. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన ఆ హీరోలు నటించే ప్రతి సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ ఉండదు.  మెగా మేనల్లుడు సాయి తేజ్ మొదట్లో హిట్ సినిమాలతో జోరు చూపించాడు. ఒక దశలో మిడ్ రేంజ్ హీరోలలో టాప్ పొజిషన్ కు చేరతాడనే అంచనాలు కూడా వెలువడ్డాయి. అయితే అప్పటినుంచి అరడజను ఫ్లాపులతో డీలా పడ్డాడు తేజు.  లాస్ట్ సినిమా 'చిత్రలహరి' తో కాస్త రిలీఫ్ దక్కింది. అప్పటివరకూ ఫ్లాపులతో ఇబ్బంది తప్పలేదు.ప్రస్తుతానికి వస్తే తేజు కొత్త సినిమా 'ప్రతిరోజూ పండగే' ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 20 న ఈ సినిమా విడుదల కానుంది.  కామెడీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రెస్ అయిన మారుతి ఈ సినిమాకు దర్శకుడు కావడంతో తేజు ఈ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాడు.  'చిత్రలహరి' తో తనకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయిందని.. 'ప్రతిరోజూ పండగే' ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇకపై మంచి సినిమాల్లో మాత్రమే నటిస్తానని చెప్పాడు. స్క్రిప్టులు ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటున్నానని తెలిపాడు.  

'ప్రతిరోజూ పండగే' తర్వాత తేజు 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమాలో తేజు సరసన నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు సుబ్బు. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.