Begin typing your search above and press return to search.

మెగా అల్లుడి మార్కెట్.. బౌన్స్ బ్యాక్ అంటే ఇది

By:  Tupaki Desk   |   10 Jun 2023 11:00 AM GMT
మెగా అల్లుడి మార్కెట్.. బౌన్స్ బ్యాక్ అంటే ఇది
X
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు సాయి ధరమ్ తేజ్. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ సినిమాతో తెరంగేట్రం చేసిన కూడా పిల్లా నువ్వు లేని జీవితం అతని ఫస్ట్ మూవీగా రిలీజ్ అయ్యింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. దీంతో తేజ్ కి స్టార్ ఇమేజ్ వచ్చేసింది.

హైపర్ యాక్టివ్ గా ఉంటూ పెర్ఫార్మెన్స్ తో జోష్ నింపడం వలన వెనక్కి వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చాడు. తాజాగా విరూపాక్ష మూవీతో నటుడిగా తనలోని మరో యాంగిల్ ని తేజ్ ఆవిష్కరించాడు. దేవాకట్టా దర్శకత్వంలో చేసిన రిపబ్లిక్ మూవీ తర్వాత తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దాని నుంచి కోలుకొని ఇప్పుడు విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు.

ఇకతేజ్ కెరియర్ పరంగా చూసుకుంటే చివరి ఐదు సినిమాలలో మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే చిత్రలహరి మూవీ 16.74 కోట్లు షేర్ అందుకుంది. కమర్షియల్ గా మంచి సక్సెస్ ని అందుకుంది.

మారుతి దర్శకత్వంలో చేసిన ప్రతి రోజు పండగే మూవీ ఏకంగా 34.06 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడం రాబట్టడం విశేషం. నెక్స్ట్ వచ్చిన సోలో బ్రతుకే సో బెటరు మూవీ కరోనా సమయంలో వచ్చి ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం 12.61 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

దీని తర్వాత వచ్చిన రిపబ్లిక్ మూవీ బాగుందనే టాక్ తెచ్చుకున్న ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఈ నేపథ్యంలో కేవలం 6.86 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది. అయితే రీసెంట్ గా వచ్చిన విరూపాక్ష మూవీ మాత్రం ఏకంగా 48.20 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు తేజ్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇదే అని చెప్పాలి. విరూపాక్షకి ముందు రిపబ్లిక్ కారణంగా తేజ్ మార్కెట్ దారుణంగా పడిపోయింది.

అయితే విరూపాక్ష మూవీ మళ్ళీ అతని ఇమేజ్ ని నిలబెట్టడంతో పాటు మార్కెట్ వేల్యూ కూడా పెంచింది. చివరి ఐదు సినిమాలకి ఏవరేజ్ షేర్ చేసుకుంటే 23.69 కోట్ల వరకు ఉంది. టైర్ 2 హీరోలలో అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్ గా ఇప్పుడు తేజ్ టాలీవుడ్ లో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. విరూపాక్ష తరహాలో కంటెంట్ బేస్డ్ కథలని ఎంచుకుంటే కచ్చితంగా అతని మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.