తేజూ అయిదేళ్ళ సినీ ప్రస్థానం.. అప్ అండ్ డౌన్స్

Thu Nov 14 2019 20:00:02 GMT+0530 (IST)

Sai Dharam Tej Fives Career Up and Down

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ 2014వ సంవత్సరంలో పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా విడుదలై అయిదు ఏళ్లు అయ్యింది. పిల్లా నువ్వులేని జీవితంకు ముందు రేయ్ చిత్రం మొదలైనా కూడా కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం చాలా చాలా ఆలస్యం అయ్యింది. చిరంజీవి మాదిరిగానే మొదట కెమెరా ముందుకు ఒక సినిమా కోసం వెళ్తే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి సినిమా ఒకటి. అలా చిరంజీవితో ఎన్నో పోలికలు ఉన్న సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఈ అయిదు సంవత్సరాల్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తూ వచ్చాడు.మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన తేజ్ రెండవ సినిమా రేయ్ తో నిరాశ పర్చాడు. ఆ వెంటనే సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంతో యంగ్ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఆ తర్వాత సుప్రీం కూడా బాగా ఆడటంతో మనోడి రేంజ్ మరింత పెరిగింది. కాని ఆ సమయంలోనే తిక్క.. విన్నర్.. నక్షత్రం.. జవాన్.. ఇంటిలిజెంట్.. తేజ్ ఐ లవ్ యూ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

కెరీర్ ఆరంభంలో సంవత్సరంకు రెండు మూడు సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ మెగా హీరో కొన్ని తప్పటడుగులు వేశాడు. దాంతో కెరీర్ లో చేదు ఫలితాలను కూడా ఈయన చూడాల్సి వచ్చింది. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది చిత్రలహరి చిత్రంతో సక్సెస్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం 'ప్రతిరోజు పండుగే' చిత్రంతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేయబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం మెగా కాంపౌండ్ లో కనిపిస్తుంది.

మెగా కాంపౌండ్ నుండి పలువురు హీరోలు వచ్చినా.. వస్తున్నా కూడా కొందరిపైనే ఎక్కువగా మెగా ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. చిరంజీవి మరియు పవన్ ఫీచర్స్ కనిపిస్తున్న తేజూ మంచి కథలతో కాస్త ఎంటర్ టైన్ మెంట్ నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తే తప్పకుండా భవిష్యత్తులో మెగా టాప్ స్టార్ అవ్వచ్చు అంటూ మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కమర్షియల్ సినిమాలను తీయడంలో దిట్ట అయినటువంటి దర్శకుల చేతిలో సాయి ధరమ్ తేజ్ పడితే ఖచ్చితంగా ఆయన కెరీర్ పీక్స్ లోకి వెళ్తుందని నమ్ముతున్నారు.

స్పీడ్ గా సినిమాలు చేసి దెబ్బ తినడం కంటే మెల్లగా చేసి సక్సెస్ లు అందుకోవాలని తేజూ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇతర యంగ్ హీరోల మాదిరిగానే ఒక సినిమా తర్వాత మరో సినిమా అనే పాలసీని తేజ్ పాటించబోతున్నాడు. అందుకే ప్రతి రోజు పండుగే సినిమా పూర్తి అయ్యే వరకు మరే సినిమాను కూడా మొదలు పెట్టలేదు. త్వరలోనే ఆ సినిమా రాబోతున్న నేపథ్యంలో కొత్త సినిమా ఏర్పాట్లలో తేజూ నిమగ్నం అయ్యి ఉన్నాడు. తేజూ ఈ అయిదు ఏళ్ల సినీ కెరీర్ లో అన్ని ఫలితాలను చూశాడని.. ముందు ముందు మరెంతో బ్రైట్ ఫ్యూచర్ తేజూకు ఉందంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.