Begin typing your search above and press return to search.

ఈ క‌ష్ట‌కాలంలో ఏం చేయాలో `సాహో లేడీ` విల‌న్ టిప్స్

By:  Tupaki Desk   |   2 May 2021 3:35 AM GMT
ఈ క‌ష్ట‌కాలంలో ఏం చేయాలో `సాహో లేడీ` విల‌న్ టిప్స్
X
ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి .. టీవీ హోస్ట్ మందిరాభేడీ ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. మందిర‌ రెగ్యుల‌ర్ ఫిట్నెస్ కార్య‌క్ర‌మాల‌ను సోష‌ల్ మీడియాల్లో అభిమానులు వైర‌ల్ చేస్తున్నారు. తాజాగా మందిర షేర్ చేసిన ఓ ఉప‌యుక్త‌మైన ఆలోచ‌న త‌న ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ లో స్ఫూర్తి నింపుతోంది.

``ప్ర‌స్తుత క‌ష్ట కాలంలో మిమ్మ‌ల్ని మీరు పూర్తి యాక్టివ్ గా ఉంచుకోవాలి. నిరంత‌రం వ్యాయామం చేయండి. దాని వ‌ల్ల ఎండార్పిన్స్ మిమ్మ‌ల్ని కాపాడ‌తాయి. ముఖ్యంగా ఇలాంటి క్లిష్ఠ స‌మ‌యంలో ఇది అవ‌స‌రం. క్షేమంగా ఆరోగ్యంగా ఉండండి.. ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కండి..`` అంటూ మందిర ఇన్ స్టాలో సందేశం ఇచ్చారు. 365 రోజుల నిరంత‌ర ఎక్స్ ర్ సైజుల్లో ఈ ఏడాదిలో ఇప్ప‌టికే 202వ రోజు త‌న వ్యాయామ సెష‌న్స్ ముగించిన‌ట్టు మందిర తెలిపారు. ఒక వారంలో త‌న షెడ్యూల్ ఏమిటో.. ఎంత ఫ్యాట్ క‌రిగించిందో కూడా మందిర గ‌ణాంకాల‌తో ఫోటోను షేర్ చేశారు. సెల్ఫ్ ల‌వ్ చాలా ముఖ్య‌మ‌ని మందిర అన్నారు.

ఇక ఈ బ్యూటీ ఇటీవ‌లే ప్ర‌భాస్ `సాహో` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించిన సంగ‌తి తెలిసిందే. మాఫియాతో లింకులున్న‌ సాఫ్ట్ విల‌నీతో మందిర ఆక‌ట్టుకున్నారు. సాహో త‌ర్వాత మందిర‌ ప‌లు బాలీవుడ్ చిత్రాల్లో న‌టించారు. సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉండే మందిర త‌న ట్రోల‌ర్స్ కి ఎప్ప‌టిక‌ప్పుడు బ‌దులిస్తూనే ఉన్నారు.

మందిరా బేడి తన కుమార్తె తారాను వేధింపులకు గురిచేసిన ఇన్ స్టాగ్రామ్ ట్రోల‌ర్ పై ఇటీవ‌ల‌ తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. ``మేడమ్ ఏ స్లమ్‌డాగ్ సెంటర్ నుండి మీ ద‌త్త పుత్రిక‌ను తీసుకున్నారు?``అని హేళ‌న చేశాడు ఒక నెటిజ‌న్. దత్తత తీసుకున్న స్ట్రీట్ కిడ్ పూర్తిగా ఆ మురికివాడ చేష్ట‌లు వ‌దిలేయ‌లేదు. మాదకద్రవ్యవాదులతో మురికివాడలకు మ‌చ్చ తెస్తున్నారు! అని ఒక ట్రోల‌ర్ అన్నారు. సోష‌ల్ మీడియాల్లో మారుపేర్ల‌తో వేధించే ఇలాంటి చ‌వ‌ట‌ల్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని మందిర దానికి కౌంట‌ర్ ఇచ్చారు.