జిగేల్ మనిపించిన సాహో బేబ్

Mon Nov 18 2019 09:46:55 GMT+0530 (IST)

Saho Babe by Jigel

ఇండస్ట్రీ హాటెస్ట్ మోడల్ కం హీరోయిన్ ఎవ్లీన్ శర్మ. `టర్న్ లెఫ్ట్` అనే అమెరికన్ సినిమా తో కెరీర్ ప్రారంభించిన ఈ ఆంగ్లో ఇండియన్ బ్యూటీ ఆ తరువాత  బాలీవుడ్ లో కథానాయిక గా రాణించేందుకు చేయని ప్రయత్నమే లేదు. ఆరంభం స్పెషల్ గీతాల్లో మెరిసింది. అటుపై పలు క్రేజీ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఇటీవల ప్రభాస్ నటించిన `సాహో` చిత్రం లోనూ మెరిసిన ఎవ్లీన్ శర్మ తన దాకా వచ్చిన ఏ అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. ఎవ్లీన్ నటిస్తున్నతాజా చిత్రం `ఎక్స్ రే ది ఇన్నర్ ఇమేజ్`. థ్రిల్లర్ నేపథ్యం లో రూపొందిన ఈ చిత్రం కోసం ఎవ్లీన్ శర్మ పై ఓ ప్రమోషనల్ సాంగ్ ని ఇటీవలే చిత్రీకరించారు. `జిగిలియా...` అంటూ సాగే ఈ రాపర్ సాంగ్ ని స్వాతీ వర్మ పాడారు.ఇటీవలే ఈ పాటని చిత్ర బృందం విడుదల చేసింది. పాటకు తగ్గట్టే జిగేల్ మనిపించే డ్రెస్సుల్లో ఎవ్లీన్ శర్మ హీటెక్కించేస్తోంది. దిల్‌బర్...చమ్మ చమ్మా... గీతాలకు ఎవర్‌గ్రీన్ మ్యూజిక్‌ని క్రియేట్ చేసిన రాజ్ అశూ ఈ పాటకు సంగీతం అందించారు. షాబీర్ అహమ్మద్ రాసిన ఈ పాటకు రాప్ ని `దిల్‌బర్..` ఫేమ్ ఇక్క అందించాడు. ఎవ్ లీన్ శర్మ వేడెక్కించే అందాలు ఈ వీడియో గీతానికి అస్సెట్.

ఈ గీతంలో నెవ్వర్ బిఫోర్ అనే రేంజులో ఎవ్లీన్ రెచ్చి పోయి చిందులేయడం యంగ్ స్టర్స్ ని ఆకట్టుకుంటోంది. ప్రదీప్ కె. శర్మ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ కె రుయీ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ మోడ్ లో వస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.