Begin typing your search above and press return to search.

శరవేగంగా పనులు కానిచ్చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   23 Jan 2021 9:34 AM GMT
శరవేగంగా పనులు కానిచ్చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్..!
X
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ''శాకుంతలం'' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల - దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ ఎపిక్ లవ్ స్టోరీని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ లో గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మిస్తున్నారు. సంగీత బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చనున్నారు. ఇందులో శకుంతలగా అక్కినేని సమంత నటించనుంది. ఇక దుష్యంతుడి పాత్రలో ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పనులను గుణశేఖర్ శరవేగంగా కానిచ్చేస్తున్నారని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

గుణశేఖర్ అంటే సెట్టింగులను పెట్టింది పేరు. అందులోనూ 'శాకుంతలం' పౌరాణికం సినిమా కావడంతో సెట్టింగులపై మరింత ఫోకస్ పెట్టనున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన సెట్ ను గుణ పరిశీలించాడు. అలానే ఒకవైపు కాస్టింగ్ పనులు కూడా చూసుకుంటూనే.. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది. గతంలో గుణశేఖర్ - మణిశర్మ కాంబోలో వచ్చిన 'చూడాలని ఉంది' 'మనోహరం' 'ఒక్కడు' 'అర్జున్' వంటి సూపర్ హిట్ మ్యూజికల్ ఆల్బమ్స్ వచ్చాయి. ఈ క్రమంలో 'శాకుంతలం' కోసం కూడా సంగీతానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. 'రుద్రమదేవి' సినిమా తర్వాత గుణ శేఖర్ నుంచి వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.