Begin typing your search above and press return to search.

ఇక చాలు.. బాలయ్యకు అండగా ఎస్వీ మనవళ్లు

By:  Tupaki Desk   |   26 Jan 2023 9:50 AM GMT
ఇక చాలు.. బాలయ్యకు అండగా ఎస్వీ మనవళ్లు
X
వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ.. అక్కినేని, ఎస్వీఆర్ ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ కాంట్రవర్సీ కామెంట్స్ పై అక్కినేని మనవళ్లు యంగ్ హీరోస్ నాగచైతన్య, అఖిల్ స్పందించారు. బాలయ్య వ్యాఖ్యలను ఖండించారు. అటు బాలయ్యకు వ్యతిరేకంగా అక్కినేని ఫ్యాన్స్ ఆందోళనలు చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఇదే అంశంపై ఎస్వీ రంగారావు మనవళ్లు జూనియర్‌ ఎస్వీ రంగారావు (నటుడు), ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు (బాబాజీ) వీడియో బైట్‌ రిలీజ్‌ చేశారు. వారు అనూహ్యంగా బాలకృష్ణకు మద్దతుగా నిలిచారు. ఈ వివాదంపై ఓ లేఖ విడుదల చేశారు. ఎస్వీఆర్ కుటుంబానికి బాలకృష్ణకు మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు.

తామంతా ఒకే కుటుంబంగా కలిసి ఉంటామని పేర్కొన్నారు. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి బాలయ్య సాధారణంగా చెప్పారని వివరించారు. ఈ విషయంలో తమకు, తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించలేదని అన్నారు. అలా తమ వ్యాఖ్యలతో ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.

ఇక ఈ విషయాన్ని సాగదియొద్దని, మరింత వివాదంగా మార్చద్దని కోరారు. తమ కుటుంబం, నందమూరి ఫ్యామిలీ మధ్య ఇబ్బంది పెట్టొద్దని అభిమానులకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇకపోతే ఇప్పటి వరకు ఈ వివాదంపై బాలయ్య మాత్రం స్పందించలేదు. మరోవైపు బాలయ్య కాంట్రవర్సీ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ రగడగా కూడా మారింది.

కాపునాడు నేతలు ఆందోళన చేస్తున్నారు. నిరసనలు చేస్తున్నారు. బాలయ్యకు అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు వైసీపీ నేత, మంత్రి రోజా కూడా బాలయ్య వ్యాఖ్యలను తప్పు బట్టన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై మాట్లాడాలని నాగార్జునను డిమాండ్ చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.