ఫ్యాన్స్ గొడవ తో మహేశ్ సినిమాకు ఆ టైటిల్ క్యాన్సిల్..!?

Mon Mar 27 2023 09:53:10 GMT+0530 (India Standard Time)

SSMB28 Movie Title Cancel

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 28 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో పూజా హెగ్డే శ్రీలీలలు హీరోయిన్లు గా నటిస్తున్నారు. శ్రీమతి మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గతేడాదిలోనే స్టార్ అయింది.ఈ క్రమంలో నే ఈ సినిమా కు అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ను పెట్టాలని చిత్రబృందం అనుకుంది. కానీ అభిమానులు నెటిజెన్ల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో.. ఈ టైటిల్ ను వదులుకున్నారు. ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసే చాలా క్యాచీగా ఉండే మరో టైటిల్ కోసం వెతుకులాడుతున్నారు.

సినిమా విడుదల కు ఇంకా చాలా సమయం ఉన్నందున కాస్త ఆలస్యమైనా సరే సినిమాకు తగ్గ మంచి పేరు తట్టే వరకూ ఎస్ఎస్ఎంబీ28 అనే వర్కింగ్ టైటిల్ నే ఉంచాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి చూడాలి ఎలాంటి టైటిల్ పెట్టి అభిమానులను ఆకట్టుకుంటారో. అలాగే సినిమా ప్రమోషన్లు అవీ నిర్వహించి కూడా అభిమానుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని చిత్రబృందం అనుకుంటోంది.

మరోవైపు ఈ సినిమాను జనవరి 13వ తేదీన రిలీజ్ చేసేందు కు నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇతర పనులను చకచకా పూర్తి చేసుకునే పనిలో పడ్డారు. మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని సమాచారం. అంతేకాదండోయ్ ఈ చిత్రం మూవీ రిలీజ్ కు ముందే రికార్డు సృష్టించింది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తికాకముందే ఓటీటీ డీల్ కుదిరింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ తెలుగు తమిళం కన్నడ మలయాళ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.