Begin typing your search above and press return to search.

SSMB 28: ఈ టైటిల్స్ కూడా నిజం కావు!

By:  Tupaki Desk   |   16 March 2023 6:43 PM GMT
SSMB 28: ఈ టైటిల్స్ కూడా నిజం కావు!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్టైల్ లోనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఫ్యాన్స్ కోరుకునే ఫన్ అండ్ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయని టాక్. మార్చి 22న ఉగాది సందర్భంగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉండబోతుంది అని నిర్మాత సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తికరమైన ప్రచారం నడుస్తుంది. ఈ సినిమా టైటిల్ ని ఉగాది రోజు అనౌన్స్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

అయితే ఈ టైటిల్స్ విషయంలో భిన్నమైన స్టోరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. అడవిలో అర్జునుడు, అతడే తన సైన్యం, అమ్మ కథ, ఆమె కథ లాంటి టైటిల్స్ అన్నీ కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న సినిమా టైటిల్స్ ప్రచారాలలో ఎలాంటి వాస్తవం లేదనే మాట వినిపిస్తుంది.

ఈ టైటిల్స్ లో ఏ ఒక్కటి కూడా సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా లేకపోవడం ఒక కారణంగా ఉంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడు కూడా ఈ తరహా టైటిల్స్ తన సినిమాలకు పెట్టడు అనే మాట అతని మూవీస్ ఫాలో అవుతున్నవారు చెప్పే మాట. అయితే త్రివిక్రమ్ సూపర్ స్టార్ కోసం ఎలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టబోతున్నాడు అనేది మాత్రం ఆసక్తికర అంశంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.