మహేష్ వర్సెస్ విజయ్.. నెగ్గేదెవరో

Sat Jan 28 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

SSMB 28 and thalapathy 67 release same date

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కోలీవుడ్ దళపతి విజయ్.. వీరి సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో పడింది. జనవరి నుంచి నాన్స్టాప్గా షూటింగ్ జరుపబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మహేష్బాబుతో అతడు ఖలేజ తర్వాత దర్శకుడు తివిక్రమ్ తీస్తున్న సినిమా కావడంతో భారీగానే అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందిస్తున్నారు. మహేశ్ సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తోంది. సెకండ్ హీరోయిన్గా శ్రీలీల నటించనుంది.ఇక ఇదిలా ఉంటే... దళపతి తన 67వ సినిమా  స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి దీని టైటిల్ ను దళపతి 67 గా ఫిక్స్ చేశారు.  ఇద్దరి కాంబినేషన్ లో మాస్టర్ సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. గ్యాంగ్స్టర్ డ్రామాగా దళపతి 67 ఉండనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ఖైదీ విక్రమ్ సినిమాలకు కనెక్ట్ ఉంటుందని టాక్ కూడా ఉంది.

తాజాగా బయటకు వచ్చిన విషయం ఏంటంటే... ఎస్ఎస్ఎంబీ 28 దళపతి 67 ఒక రోజు తేడాతో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక బాక్స్ ఆఫీస్ వార్ లో ఎవరు నెగ్గుతారో చూడాలి. మహేశ్ విజయ్ ల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద వార్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మహేశ్ 28వ సినిమా అక్టొబర్ 18న విడుదల కానుండగా.. దళపతి 67 సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మహేశ్ వర్సెస్ విజయ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

అయితే మహేశ్ సినిమాలను విజయ్ తమిళంలో రిమేక్ చేసిన విషయం తెలిసిందే. మహేశ్ బాబు నటించిన ఒక్కడు పోకిరి లాంటి సినిమాలు విజయ్ రీమెక్ చేసి హిట్ కొట్టారు. ఇప్పుడు వీరు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్నారు. ఇక మహేశ్ తన 28 వ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.