Begin typing your search above and press return to search.

SSMB 28: డిజిటల్ డీల్ తో రెమ్యునరేషన్స్ సెట్!

By:  Tupaki Desk   |   31 Jan 2023 1:52 PM GMT
SSMB 28: డిజిటల్ డీల్ తో రెమ్యునరేషన్స్ సెట్!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. హారిక హాసిని భారీ బడ్జెట్ తో తెరపైకి తీసుకురాబోతున్న ఈ సినిమా కమర్షియల్ గా మార్కెట్లో అయితే మంచి డిమాండ్ ఏర్పరచుకుంటుంది. సినిమా షూటింగ్ మొదలు కాకముందే చాలా ఏరియాల నుంచి ఈ సినిమా రిలీజ్ హక్కులను దక్కించుకోవడానికి బయ్యర్లు పోటీపడ్డారు.

అయితే నిర్మాతలు మాత్రం టెంప్ట్ అవ్వకుండా కొన్ని రోజులు వాటిని పెండింగ్ లిస్టులో అయితే పెట్టారు. అయితే ముందుగా ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ గా మంచి ఆఫర్స్ వస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి నెట్ ఫ్లిక్స్ అయితే ఈ సినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది. కేవలం తెలుగు భాషకు సంబంధించిన రైట్స్ మాత్రమే కాకుండా మిగతా లాంగ్వేజ్ డిజిటల్ హక్కులను కూడా ఆ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇక వచ్చిన మొత్తంతో నిర్మాత హీరో రెమ్యూనరేషన్ తో పాటు సంగీత దర్శకుడు అలాగే హీరోయిన్ పారితోషికాలను కూడా బ్యాలెన్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు మహేష్ బాబు దాదాపు 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇక సంగీత దర్శకుడు థమన్ 6 కోట్లు పూజా హెగ్డే 4 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మొత్తాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా నిర్మాతలు డిజిటల్ హక్కులను 80 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. ఒక విధంగా మహేష్ బాబు కెరీర్ లోనే ఇది అత్యధిక బిజినెస్ చేయబోతున్నట్లు మీటింగ్ తోనే క్లారిటీగా అర్థమయింది.

ఇటీవల కాలంలో అయితే మహేష్ బాబు ఎక్కువగా సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోకుండా పార్ట్నర్ గా కలిసి లాభాల్లో వాటా అందుకునే విధంగా ముందుకు వెళుతూ ఉన్నాడు. కానీ ఈసారి త్రివిక్రమ్ హారిక హాసిని కాంబినేషన్ కాబట్టి వాళ్లు పార్ట్నర్స్ గా ఉన్నారు కావున మహేష్ కు ఆ అవకాశం దొరకలేదు. ఏదేమైనా కూడా అతనికి రేంజ్ కు తగ్గట్టుగానే 70 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.