Begin typing your search above and press return to search.

SSMB 28: మాస్ స్ట్రైక్ రెడీ.. థియేటర్స్ లోనే!

By:  Tupaki Desk   |   29 May 2023 5:00 PM GMT
SSMB 28: మాస్ స్ట్రైక్ రెడీ.. థియేటర్స్ లోనే!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు చాలా కమర్షియల్ చిత్రాలు చేసిన కంప్లీట్ మాస్ బ్యాక్ డ్రాప్ కథలని మాత్రం ట్రై చేయలేదు. అయితే మొదటి సారి త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకొని చేస్తోన్న చిత్రం ఎస్ఎస్ఎంబి 28. ఈ మూవీ పల్నాడు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది.

మొదటి సారి కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ ట్రై చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న మోసగాళ్ళకి మోసగాడు సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. ఆరోజు ఫ్యాన్స్ కి డబల్ భోనాంజ ఇచ్చే విధంగా మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ పోస్టర్, మాస్ స్ట్రైక్ ని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సెలబ్రేషన్స్ ఇంకా రెండు రోజులే టైమ్ ఉంది. సూపర్ స్టార్ అభిమానులు చాలా కాలం నుంచి మహేష్ బాబు కంప్లీట్ మాస్ క్యారెక్టర్ లో చూడాలని అనుకుంటున్నారు.

ఈ సినిమాలో అలాంటి క్యారెక్టర్ లోనే కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఎస్ఎస్ఎంబి 28 నుంచి మాస్ స్ట్రైక్ కి మరో రెండు రోజులు మాత్రమే ఉందంటూ పోస్టర్ ని ఆవిష్కరించారు.

ఈ పోస్టర్ లో ఒంటి కాలితో మోకాలి మీద కూర్చొని భూమికి దండం పెడుతూ ఉన్నాడు.అలాగే గళ్ళ చొక్కా వేసుకొని, బెల్ట్ చెప్పులు తొడుక్కొని, తలకి ఎర్ర కండువా కట్టుకొని విలన్స్ తో ఫైట్ కి సిద్ధమైనట్లుగా అతని స్టిల్ ఉంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ అభిమానులు దీనిని విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

మిల్కీ బాయ్ లాంటి హీరోని గుంటూరు మిర్చిగా త్రివిక్రమ్ తన సినిమా కోసం మార్చేసాడని ఈ లుక్ చూసిన తర్వాత కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి రాబోతోన్న మాస్ స్ట్రైక్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అదే సమయంలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్న వారు కూడా ఉండటం విశేషం.