Begin typing your search above and press return to search.

SSMB 28: మహేష్ మాస్ పోస్టర్.. నాన్న కోసమే!

By:  Tupaki Desk   |   31 May 2023 9:36 AM GMT
SSMB 28: మహేష్ మాస్ పోస్టర్.. నాన్న కోసమే!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ లో భారీ బడ్జెట్లో తెర పైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే పెరుగుతున్నాయి. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అయితే ఈ సినిమా కు సంబంధించిన సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ముందే క్లారిటీ ఇచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్ట్రైక్ వీడియో రాబోతున్నట్లుగా వివరణ ఇచ్చారు. అయితే దాన్ని ప్రత్యేకంగా కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్లో విడుదల చేయబోతున్నారు. కృష్ణ ఎవర్ గ్రీన్ హిట్ మోసగాళ్లకు మోసగాడు 4K వెర్షన్ మళ్ళీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

ఇక ఆ సినిమా తో పాటు మహేష్ బాబు 28వ సినిమా కు సంబంధించిన స్పెషల్ స్ట్రైక్ టీజర్ను కూడా విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఉదయాన్నే మహేష్ బాబు ఒక మాస్ పోస్టర్ విడుదల చేశారు. ఈరోజు చాలా స్పెషల్ అంటూ ఇది మీకోసమే నాన్న అని మహేష్ బాబు ఆ పోస్టర్ను విడుదల చేశాడు.

ఇక అందులో మహేష్ బాబు ఎర్ర తుండువాను నెత్తి కి కట్టుకొని చాలా సీరియస్ లుక్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. లుక్ అయితే మాస్ రాంపేజ్ అనే తరహాలో ఉంది అని బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా అని ఫాన్స్ అయితే పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని సాంగ్స్ కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఇక సినిమా ను 2024 సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు. మహేష్ బాబు కు జోడి గా పూజా హెగ్డే మేయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.