సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా యొక్క చిత్రీకరణ హైదరాబాద్ లో శర వేగంగా జరుగుతోంది. మహేష్ బాబు తల్లి మరియు తండ్రి మృతి చెందడంతో షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది. అంతే కాకుండా స్క్రిప్ట్ విషయంలో కూడా పదే పదే మార్పులు చేర్పులు చేశారు అనేది టాక్ వినిపించింది.
ఎట్టకేలకు SSMB 28 సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్న సంక్రాంతికి సినిమా నుండి ఫస్ట్ లుక్ వస్తుందని అంతా ఆశించారు. కానీ త్రివిక్రమ్ కాస్త ఆగాలంటూ ఫస్ట్ లుక్ ను రివీల్ చేయలేదు. త్వరలోనే సినిమా యొక్క ఫస్ట్ లుక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబో మూవీ యొక్క ఫస్ట్ లుక్ ఇంకా రివీల్ కాకుండానే ఫ్యాన్స్ ముందుకు మహేష్ బాబు యొక్క లుక్ రివీల్ అయ్యింది.
తాజాగా మహేష్ బాబు ఒక పార్టీ లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మహేష్ బాబు లుక్ కూల్ గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
కాస్త గడ్డంతో మహేష్ బాబు లుక్ కు అంతా ఫిదా అవుతున్నారు. త్రివిక్రమ్ సినిమాలో కూడా ఇదే లుక్ తో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వారి ఆకలిని తీర్చేలా ఉండాలని కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలసిందే. శ్రీలీల ను ఈ సినిమాలో నటింపజేస్తున్న విషయం కూడా తెల్సిందే. ఇటీవలే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ఆగస్టు లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నాడు. ఏప్రిల్ నెలలో విడుదల అనుకున్నప్పటికి షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఆగస్టు కు వాయిదా వేయడం జరిగింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.